ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath singh: జవాన్లతో కలిసి ఆయుధపూజ చేసిన రాజ్‌నాథ్ సింగ్

ABN, Publish Date - Oct 12 , 2024 | 03:03 PM

ఏళ్ల తరబడి జవాన్లు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా వస్తోందని, ఈరోజు విజయానికి సంకేతమని, శ్రీరాముడు రావణుని సంహరించిన రోజని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇది కేవల విజయం కాదు, మానవతావాదాన్ని దక్కిన విజయమని అన్నారు.

డార్జిలింగ్: దేశవ్యాప్తంగా విజయదశమి (Vijaya Dashami) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) డార్జిలింగ్‌ (Darjeeling)లోని శుక్నా కంటోన్మెంట్‌లో శనివారంనాడు భారత జవాన్లతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయుధ పూజ చేసి వీరజవాన్లకు తిలకం దిద్దారు. జవాన్లకు, వారి కుటుంబాలకు విజయ దశమి శుక్షాకాంక్షలు తెలిపారు. వారిలో ఒకడిగా విజయదశమి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.


''శస్త్రపూజను ఎంతో శ్రద్ధాభక్తులతో జరుపుకొనే కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. మన ఆరాధ్యదైవాలను పూజించేటప్పుడు శస్త్రపూజ చేయడం మన సంప్రదాయం. దేశంలోని ప్రొఫెషనల్స్ అంతా ఏడాదికి ఒకసారి తమ పనిముట్లను పూజించడం మనం చూస్తుంటాం. దీపావళి, వసంత పంచమి రోజున విద్యార్థులు ఇంక్, పుస్తకాలకు పూజలు చేస్తారు. సంగీత విద్వాంసులు తమ వాయిద్యాలకు పూజు చేస్తారు. దేశంలోని అనేక కుటుంబాలు వ్యవసాయ సంబంధిత కుటుంబాలు ఉన్నాయి. శస్త్రపూజ అంటే కేవలం వాటిని పూజించడమే కాదు, పని పట్ల మనకున్న గౌరవాన్ని చాటుకోవడం కూడా అవుతుంది'' అని రాజ్‌నాథ్ అన్నారు.


ఏళ్ల తరబడి జవాన్లు ఆయుధపూజ చేయడం సంప్రదాయంగా వస్తోందని, ఈరోజు విజయానికి సంకేతమని, శ్రీరాముడు రావణుని సంహరించిన రోజని అన్నారు. ఇది కేవల విజయం కాదు, మానవతావాదాన్ని దక్కిన విజయమని అన్నారు. శ్రీరాముని లక్షణాలు మన జవాన్లలో తాను చూశానని, ఈ రోజు వరకూ మన సంస్కృతిని అవమానించినప్పుడు మాత్రమే భారతదేశం ఇతర దేశాలపై దాడి జరిపిందని, విద్వేషం కారణంగా ఎన్నడూ దాడులు చేయలేదని అన్నారు. దేశ ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలిగినా ఎలాంటి పెద్ద చర్య తీసుకోవడానికైనా వెనుకాడేది లేదని, దేశ ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ జవాన్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Haryana: హర్యానాలో కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకార తేదీలో ట్విస్ట్

Updated Date - Oct 12 , 2024 | 03:03 PM