ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ramdas: తేల్చి చెప్పేశారు.. భవిష్యత్తులో ఆ పార్టీలతో పొత్తు పెట్టుకోం..

ABN, Publish Date - Apr 03 , 2024 | 10:47 AM

భవిష్యత్తులో కూడా డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌(Anbumani Ramdas) ప్రకటించారు.

- పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి

చెన్నై: భవిష్యత్తులో కూడా డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌(Anbumani Ramdas) ప్రకటించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పొత్తు పెట్టుకోవడంపై తన తండ్రి రాందా్‌సకు, తనకు మధ్య భిన్నాభిప్రాయాలు పొడసూపలేదని, కానీ సోషల్‌ మీడియాలో దీనిపై లేనిపోని తప్పుడు కథనాలు వైరల్‌ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే మాజీ మంత్రి సీవీ షణ్ముగం దిండివనం సమీపంలో ఉన్న తైలావరం గార్డెన్‌లో తన తండ్రి రాందాస్‏తో భేటీ అయ్యాక ఈ కథనాలు ప్రసారమయ్యాయని వివరించారు. తాము ఎన్నికలకు సంబంధించి అన్నాడీఎంకే, డీఎంకేలతో రాయబారం సాగించలేదన్నారు. రాష్ట్రంలో వంతుల వారీగా అధికారం చేపడుతున్న ద్రావిడ పార్టీల పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, అందువల్లే ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశ క్షేమాన్ని కోరుకుంటున్న బీజేపీతో చేతులు కలిపామన్నారు. ఎన్డీఏ కూటమి అధిక స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేతో పొత్తు ఉండబోదని పునరుద్ఘాటించారు.

ఇదికూడా చదవండి: Nirmala Sitharaman: ప్రత్యేక నిధిగా చెన్నైకి రూ.5వేల కోట్లిచ్చాం!

Updated Date - Apr 03 , 2024 | 10:47 AM

Advertising
Advertising