Share News

Bengaluru: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు: సూత్రధారులు అరెస్ట్

ABN , Publish Date - Apr 12 , 2024 | 02:28 PM

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు బాంబును అమర్చిన ముసావీర్ హుస్సేన్‌ను పశ్చిమబెంగాల్‌లో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం తెలిపారు.

Bengaluru: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు: సూత్రధారులు అరెస్ట్
Mussavir Hussain Shazib,Abdul Matheen Taha

బెంగళూరు, ఏప్రిల్ 12: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు ఈ బాంబు అమర్చిన ముసావీర్ హుస్సేన్‌ను కొల్‌కత్తాలో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. బెంగళూరులో ఐసిస్‌కు సంబంధించిన కేసులో అబ్దుల్ మతీన్ తాహా ప్రమేయం ఉందని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు.

2020 టెర్రరిజం కేసులో వీరిద్దరి ప్రమేయం ఉందన్నారు. వీరిద్దరు నకిలీ దృవపత్రాలు సృష్టించుకొన్నారని.. మహ్మద్ జునెద్ సయ్యదు పేరు షాజిద్‌గాను, అలాగే తాహా హిందువు విఘ్నేష్ పేరుతో ఆధార్ కార్డు రూపొందించుకున్నారని వివరించారు. ఈ పేలుడుకు పాల్పడిన ఈ ఇద్దరు వ్యక్తులు ఆచూకి తెలిపితే ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తామని.. అందుకు సంబంధిన నిందితుల ఫోటోలను విడుదల చేసి.. ఎన్ఐఏ రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

PM Modi: త్వరలో జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు


అయతే ఈ పేలుడులో ప్రధాన నిందితుడుకి సహకరించారనే విచారణలో తేలడంతో... చిక్‌మంగళుర్‌కు చెందిన ముజామిల్ షరీప్‌ను గత నెలలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ పేలుళ్లులో నిందితులను అరెస్ట్ చేయడానికి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతోపాటు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ పోలీసుల సహకారాన్ని తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

Bangalore: ఎన్నికలవేళ కాంగ్రెస్‏కు బిగ్ షాక్‌.. పార్టీకి సీఎం ఆప్తుడు గుడ్‌బై

ఈ ఏడాది, మార్చి 1వ తేదీ బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఈ పేలుళ్లపై ఎన్ఐఏ విచారణ చేపట్టింది. అందులోభాగంగా సదరు కేఫ్‌లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌లను పరిశీలించింది.

Film actress Gautami: సినీ నటి గౌతమి అంతమాట అనేశారేంటో.. ఆమె ఏమన్నారో తెలిస్తే...

ఒక వ్యక్తి బ్యాగ్‌తో కేఫ్‌కు రావడం.. అతడు టిఫిన్‌కు ఆర్డర్ ఇవ్వడం.. ఆ తర్వాత అతడు ఆ టిఫిన్ తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవడం.. అలా అతడు వెళ్లిన కొన్ని నిమిషాలకే కేఫ్‌లో పేలుడు సంభవించినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. ఇక ఈ పేలుడు సంభవించిన తర్వాత.. కేఫ్‌కు వచ్చిన వ్యక్తి పలుమార్లు తన దుస్తులు మార్చినట్లు ఎన్ఐఏ అదికారులు పేర్కొన్నారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 12 , 2024 | 02:37 PM