ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

21 మంది పిల్లలపై అత్యాచారం.. హాస్టల్‌ వార్డెన్‌కు మరణశిక్ష

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:43 AM

నైతిక విలువలు మరిచిన గురువులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. 21 మంది పిల్లలపై అత్యాచారం చేసిన హాస్టల్‌ వార్డెన్‌ యుమ్‌కెన్‌ బగ్రాకు మరణశిక్ష విధిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యుపియాకు చెందిన ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది.

  • మరో టీచరు, హెడ్మాస్టర్‌కు 20 ఏళ్ల వంతున జైలు

  • బాధితుల్లో 15 మంది బాలికలు, ఆరుగురు బాలురు

  • అరుణాచల్‌ ప్రదేశ్‌ పోక్సో కోర్టు తీర్పు

ఇటానగర్‌, సెప్టెంబరు 26: నైతిక విలువలు మరిచిన గురువులకు న్యాయస్థానం కఠిన శిక్షలు విధించింది. 21 మంది పిల్లలపై అత్యాచారం చేసిన హాస్టల్‌ వార్డెన్‌ యుమ్‌కెన్‌ బగ్రాకు మరణశిక్ష విధిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని యుపియాకు చెందిన ప్రత్యేక పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇందుకు సహకరించిన మరో ఇద్దరికి 20 ఏళ్ల వంతున జైలు శిక్ష విధించింది. బాధితుల్లో 15 మంది బాలికలు, ఆరుగురు బాలురు ఉన్నారు. వారంతా 6-15 ఏళ్లలోపు ఉన్నవారే. షివోమీ జిల్లాలోని కారో గవర్నమెంట్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పనిచేసిన ఆ వార్డెన్‌ 2019-2022 మధ్య ఈ దారుణానికి పాల్పడినట్టు కేసు నమోదయింది.

ఈ సంగతి తెలిసినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుండా సహకరించినందుకు అప్పటి హెడ్మాస్టర్‌ సింగుటున్‌ యోర్పెన్‌, హిందీ టీచరు మార్‌బోమ్‌ నగోమ్‌దిర్‌లకు 20 ఏళ్ల వంతున కఠిన కారాగార శిక్ష విధించింది. పిల్లలకు మత్తుమందు ఇచ్చి, వారు నిద్రలోకి జారుకున్న తరువాత అత్యాచారం చేసినట్టు ‘సిట్‌’ దర్యాప్తులో తేలింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఎవరూ నోరు మెదపలేకపోయారు. కానీ గత ఏడాది నవంబరులో కవలలైన తన ఇద్దరు కుమార్తె(12 ఏళ్లు)లపై అత్యాచారం చేసినట్టు ఓ తండ్రి ఫిర్యాదు చేయడంతో జరిగిన నేరం వెలుగులోకి వచ్చింది.

అనంతరం మరికొందరు ఫిర్యాదు చేయడంతో మొత్తం 21 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి. వీటిని చూసి వార్డెన్‌ యుమ్‌కెన్‌ బగ్రా పరారవగా, పోలీసులు గాలించి ఆ నెల చివర్లో అరెస్టు చేశారు. అనంతరం కోర్టు నిందితునికి బెయిల్‌ మంజూరు చేసింది. తీవ్రమైన నేరాలు ఉన్నా బెయిల్‌ ఇవ్వడంపై గౌహతి హైకోర్టు ఇటానగర్‌ బెంచ్‌ సుమోటోగా విచారణ జరిపింది. నేర తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది జూలైలో బెయిల్‌ను రద్దు చేసింది. పోక్సో కోర్టు విచారణ జరిపి కఠినాతికఠిన శిక్షలు విధించింది. దీనిపై ఎస్పీ రోహిత్‌ రాజ్‌బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ ప్రస్తుత కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదన్న ఉద్దేశంతో కోర్టు గరిష్ఠ శిక్షలు విధించిందని తెలిపారు.

Updated Date - Sep 27 , 2024 | 03:43 AM