ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sabarimala: శబరిమలకు వెళ్తున్నారా.. వాటితో జాగ్రత్త

ABN, Publish Date - Nov 19 , 2024 | 04:58 PM

అయ్యప్ప స్వామి కొలువు తీరిన శబరిమలలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. విధులు ముగించుకుని బ్యారెక్స్ చేరిన వారికి కంటి మీద కునుకు ఉండడం లేదని వారు వాపోతున్నారు.

కార్తిక మాసం ప్రారంభమైంది. దీంతో శబరిమలలో స్వాముల తాకిడి భారీగా పెరిగింది. ఆ క్రమంలో భద్రత చర్యల్లో భాగంగా శబరిమలలో భారీగా పోలీసులు మోహరించారు. అలాంటి వేళ వారి బస కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బ్యారక్స్ ఏర్పాటు చేసింది. అయితే ఈ బ్యారక్స్‌లో ఎలుక బెడద తీవ్రమైంది. డ్యూటీ ముగించుకుని.. విశ్రాంతి కోసం బెరక్స్ చేరిన పోలీసులను ఎలుకలు ముప్ప తిప్పలు పెడుతున్నాయి. సోమవారం రాత్రి నిద్రిస్తున్న ఏడుగురు పోలీసులను ఎలుకలు కుట్టాయి. దీంతో ఆలయ పరిసర ప్రాంతంలోని సన్నిధానం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు.


గత కొద్ది రోజుల క్రితం ఇలాగే ఇద్దరు వ్యక్తులను ఎలుకలు కుట్టాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఆద మరచి నిద్రిస్తున్న వేళ.. ఎలుకలు కోరుతుండడంతో ఇటు పోలీసులు అటు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా శబరిమలకు తరలి వస్తారని పోలీసులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సమయంలో విధులు నిర్వహించి.. విశ్రాంతి తీసుకునేందుకు అర్థరాత్రో అపరాత్రో బ్యారక్స్ చేరుకుంటున్నామని వారు వివరించారు.


అలాంటి వేళ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఎలుకలు ఇలా తమను కొరుకుతుంటే.. కంగారు, గాబరాతోపాటు ఓ విధమైన ఆందోళన ఆకస్మాత్తుగా వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే పరిస్థితి.. శబరిమలలో భక్తుల కోసం నిర్మించిన కాటేజీల్లో సైతం ఉందని వారు సోదాహరణగా వివరించారు. అయితే తమలో చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని గుర్తు చేశారు. ఇలా ఎలుకలు కొరికిన గాయాలు ఒక పట్టాన మానడం లేదని వారు పేర్కొన్నారు.


ఆసుపత్రికి వెళ్లినా.. టీటీ ఇంజెక్షన్ చేసి.. మందులు మాత్రం ఇచ్చారన్నారు. కానీ ఎలుకలను నియంత్రించేందుకు దేవస్థానం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీసులు పెదవి విరిచారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు భక్తులు భారీగా తరలి వస్తారని చెప్పారు. వారు తెచ్చుకునే ఆహార పదార్థాలు.. ఇక్కడే పడేస్తున్నారన్నారు.


దీంతో ఎలుకలు సంఖ్య భారీగా పెరుగుతుందని చెప్పారు. భక్తులు శుభ్రత పాటించడంతోపాటు.. ఆహార పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా దేవస్థానం అధికారులు కఠిన నిబంధన విధించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.


శబరిమలలో సంక్రాంతి వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని వారు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలుకలను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అలా కాకుంటే.. ఎలుకల తీరు వల్ల భారీగా భక్తులు సైతం తీవ్ర ఇబ్బందులు తప్పవని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

For National News And Telugu News

Updated Date - Nov 19 , 2024 | 05:01 PM