Ration Scam: రేషన్ పంపిణీ స్కాంలో టీఎంసీ నేత అరెస్ట్
ABN, Publish Date - Jan 06 , 2024 | 09:14 AM
రేషన్ పంపిణీ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు శంకర్ అధ్యాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. విస్తృత సోదాల అనంతరం బంగాన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అయిన శంకర్ అధ్యాను ఈడీ అదుపులోకి తీసుకుంది.
కోల్‌కతా: రేషన్ పంపిణీ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు శంకర్ అధ్యాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. విస్తృత సోదాల అనంతరం బంగాన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అయిన శంకర్ అధ్యాను ఈడీ అదుపులోకి తీసుకుంది. విచారణలో ఈడీ అధికారులకు సహకరించినప్పటికీ తన భర్తను అరెస్ట్ చేశారని శంకర్ అధ్యా భార్య జ్యోత్స్న తెలిపారు. శంకర్ అధ్యాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌లోని శంకర్ అధ్యా, మరో టీఎంసీ నాయకుడు సహజాన్ షేక్ ఇళ్లలో ఈడీ దాడులు నిర్వహించింది. దర్యాప్తు సంస్థ ఈడీ తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో లబ్దిదారులకు అందాల్సిన రేషన్ సరుకుల్లో నిందితులు దాదాపు 30 శాతం బహిరంగ మార్కెట్‌కు తరలించారు. కాగా శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడానికి వెళ్తున్నప్పుడు సహజన్ షేక్ మద్దతుదారులు వారిపై దాడి చేశారు. 800 నుంచి 1,000 మందితో కూడిన ఓ గుంపు తమను చంపేందుకు దాడి చేసిందని ఈడీ అధికారులు తెలిపారు.
Updated Date - Jan 06 , 2024 | 09:14 AM