ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాక్ష్యాధారాల ధ్వంసంపై ఆర్జీ కర్‌ మాజీ ప్రిన్సిపల్‌ అరెస్టు

ABN, Publish Date - Sep 15 , 2024 | 02:40 AM

దేశాన్ని కుదిపేస్తున్న కోల్‌కతా ఆర్జీ కర్‌ వైద్య కళాశాల విద్యార్థిని హత్యాచార కేసులో ఆ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరోసారి అరెస్టు చేసింది.

  • కోల్‌కతా మెడికో హత్యాచారం కేసులో అదుపులోకి తీసుకున్న సీబీఐ

  • విచారణను తప్పుదోవ పట్టించినందుకు కూడా అభియోగాలు నమోదు

  • వీటితోపాటు ఎఫ్‌ఐఆర్‌ ఆలస్యంపైనా తలా ఠాణా ఎస్‌హెచ్‌వో అరెస్టు

  • బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో ముందుకుసాగని మెడికోల చర్చలు

  • ప్రత్యక్ష ప్రసారానికి పట్టుబట్టిన వైద్యులు.. ఒప్పుకోని ముఖ్యమంత్రి

కోల్‌కతా, సెప్టెంబరు 14: దేశాన్ని కుదిపేస్తున్న కోల్‌కతా ఆర్జీ కర్‌ వైద్య కళాశాల విద్యార్థిని హత్యాచార కేసులో ఆ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరోసారి అరెస్టు చేసింది. సాక్ష్యాధారాల ధ్వంసంతో పాటు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని అభియోగాలు మోపింది. వీటితో పాటు, ఎఫ్‌ఐఆర్‌ నమోదులో ఆలస్యం చేసినందుకు కేసును తొలుత విచారించిన తలా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) అభిజిత్‌ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. మండల్‌ను కొన్ని గంటల పాటు విచారించిన సీబీఐ.. ఆయన నుంచి

సరైన జవాబులు రాకపోవడంతో అదుపులోకి తీసుకుంది. 8 సార్లు ప్రశ్నించినా.. ప్రతిసారీ వేర్వేరు సమాధానాలు ఇచ్చారని పేర్కొంది. ఈ కేసులో 17వ తేదీ నాటికి కోల్‌కతా హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. మరో ఇద్దరు కోల్‌కతా పోలీసులపైనా సీబీఐ నజర్‌ పెట్టినట్లు సమాచారం. కాగా, అంతకుముందు సీబీఐ.. సందీప్‌ ఘోష్‌పై హత్యాచారం అభియోగాలను నమోదు చేసినట్లు పీటీఐ పేర్కొంది. మరోవైపు మెడికోపై హత్యాచారం కేసులో సందీప్‌ ఇప్పటికే సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ఆయనను దర్యాప్తు సంస్థ ఈ నెల 2న అరెస్టు కూడా చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆగస్టు 9న యువ వైద్యురాలు.. ఆర్జీ కర్‌ సెమినార్‌ హాల్‌లో హత్యాచారానికి గురయ్యారు. హాల్‌లోకి వెళ్లి బయటకు వస్తున్నట్లుగా ఉన్న సీసీ టీవీ దృశ్యాల మేరకు వాలంటీర్‌ సంజయ్‌ రాయ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించింది. నార్కో టెస్టు చేయాలనుకున్నా.. అతడు ఒప్పుకోకపోవడంతో సాధ్యం కాలేదు.


  • వైద్యులతో సీఎం చర్చలపై ప్రతిష్ఠంభన

బెంగాల్‌ వైద్యులు, సీఎం మమతా మధ్య చర్చలపై ప్రతిష్ఠంభన వీడలేదు. బాధిత మెడికో కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నెల రోజులకు పైగా నిరసనలు చేస్తున్న వైద్యులు.. శనివారం సీఎంతో చర్చలకు సిద్ధమయ్యారు. అయితే, వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని పట్టుబట్టారు. విషయం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున ఇది సాధ్యం కాదని మమతా స్పష్టం చేశారు. అంగీకారం కుదిరిన డిమాండ్లపై నిమిషాల్లో సంతకం చేస్తానని కూడా చెప్పారు. దీనికిముందు ఆమె వైద్యుల దీక్షా శిబిరానికి వెళ్లారు. సీఎం ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లినప్పటికీ.. ప్రత్యక్ష ప్రసారానికే పట్టుబట్టడంతో చర్చలు సాగలేదు. 2 గంటల తర్వాత వైద్యులు కన్నీరుపెడుతూ వెళ్లిపోయారు. అయితే, తనను పదేపదే అవమానించ వద్దని.. ఇప్పటికే మూడుసార్లు ఇలా చేశారని మమత అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 15 , 2024 | 02:40 AM

Advertising
Advertising