ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kolkata Horror: పాలిగ్రాఫ్‌ టెస్టుకు దొరక్కుండా మాజీ ప్రిన్సిపల్ సమాధానాలు: సీబీఐ

ABN, Publish Date - Sep 16 , 2024 | 02:40 PM

ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో 'ఆర్థిక అవకతవకల' కోణం నుంచి సీబీఐ విచారణ కొనసాగుతోంది. మాజీ ప్రిన్సిపల్‌పై జరిపిన పాలిగ్రాఫ్ టెస్టుపై సీబీఐ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

కోల్‌కతా: సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం కేసులో 'ఆర్థిక అవకతవకల' కోణం నుంచి కూడా సీబీఐ (CBI) విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ (Sandip పై పాలిగ్రాఫ్ టెస్ట్, వాయిస్ ఎనాలిసిస్ జరుపగా, ఆయన మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.


ఆగస్టు 9వ తేదీని ఆర్జీ కర్ ఆసుపత్రి సెమినార్ హాలులో అత్యాచారం, హత్యకు గురైన ట్రయినీ వైద్యురాలి ఘటన సంచలనం సృష్టించడంతో సీబీఐకి కేసు అప్పగించారు. హత్యాచార ఘటనపై ఉదయం 9.59 గంటలకు సందీప్ ఘోష్‌కు సమాచారం అందిందని, కానీ వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సీబీఐ చెబుతోంది. సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగంపై ఆయనను ఈనెల 2న అరెస్టు చేసి పాలిగ్రాఫ్, వాయిస్ ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ రెండు పరీక్షల్లో ఆయన మోసపూరిత సమాధానాలు ఇచ్చారని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక ఇచ్చినట్టు సీబీఐ అధికారులు తాజాగా తెలిపారు.

Mamata Banerjee: జూనియర్ వైద్యులను మళ్లీ చర్చలకు ఆహ్వానించిన సీఎం


కాగా, సందీప్ ఘోష్‌తో పాటు తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అభిజిత్ మండల్‌ను కూడా సీబీఐ ఇటీవల అరెస్టు చేసింది. ఆగస్టు 9వ తేదీ ఉదయం 9.58 గంటలకు సందీప్ ఘోష్‌కు సమాచారం అందగా, 10.03 గంటలకు ఆయన మండల్‌తో మాట్లాడాడని, 11.30 గంటలకు అసహజ మరణంగా కేసు రిజిస్టర్ అయిందని సీబీఐ తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి మండల్ చేరుకోలేదని కూడా సీబీఐ ఆరోపణగా ఉంది.


For MoreNational NewsandTelugu News

Also Read:Uttar Pradesh: భారీ వర్షాలతో యూపీ అతలాకుతలం : 14 మంది మృతి

Also Read:Uttar Pradesh: మళ్లీ తోడేలు దాడి: బాధిత కుటుంబాలతో సీఎం యోగి భేటీ

Updated Date - Sep 16 , 2024 | 02:40 PM

Advertising
Advertising