High Court: వివాహేతర సంబంధం నేరమా.. కోర్టు ఏమందంటే
ABN, Publish Date - Apr 02 , 2024 | 06:50 PM
వివాహేతర శృంగారం నేరం కాదని రాజస్థాన్ హైకోర్టు(Rajasthan High Court) మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరి సమ్మతంతో పెళ్లి అయ్యాక శృంగారం చేస్తే శిక్షార్హమైన నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.
జైపుర్: వివాహేతర శృంగారం నేరం కాదని రాజస్థాన్ హైకోర్టు(Rajasthan High Court) మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. ఇద్దరి సమ్మతంతో పెళ్లి అయ్యాక శృంగారం చేస్తే శిక్షార్హమైన నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. తన భార్యను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. అయితే కోర్టుకు హజరైన సదరు మహిళ.. తనను అపహరించారన్నది అవాస్తవమని చెప్పింది. నిందితులలో ఒకరితో తాను సహజీవనం చేస్తున్నట్లు బయటపెట్టింది. బాధిత వ్యక్తి తరఫు న్యాయవాది అంకిత్ ఖండేల్వాల్ వాదనలు వినిపిస్తూ.. వివాహేతర సంబంధాన్ని బాధితుడి భార్య అంగీకరించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిమాణం.. ఆయనకి బెయిల్ మంజూరు
న్యాయమూర్తి మాట్లాడుతూ.. వివాహేతర జంట ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పాల్గొంటే నేరం కిందకు రాదని స్పష్టం చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమెను శిక్షించాలని కోర్టును భర్త తరఫు న్యాయవాది కోరగా.. ఆమె చేసిన పనిని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీం ఏమందంటే..
వివాహేతర సంబంధంపై గతంలో సుప్రీం కోర్టు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ సంబంధం నేరం కాదని తీర్పునిచ్చింది. భర్తకు మహిళ వ్యక్తిగత ఆస్తి కాదని పేర్కొంటూ వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ సెక్షన్ 497ను కొట్టేసింది. 2018 సెప్టెంబర్ లో వెలువడిన ఈ తీర్పు ప్రకారం.. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లిందని, అది రాజ్యాంగ విరుద్ధమని కోర్టు ప్రకటించింది.
బ్రిటిష్ కాలం నాటి వ్యభిచార వ్యతిరేక చట్టం మహిళలను మగవారు తమ సొంత ఆస్తిగా పరిగణించేలా ఉందని, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని కోర్టు కామెంట్స్ చేసింది. ఇష్టపూర్వక శృంగారంలో పాల్గొనడం మహిళల హక్కని, ఈ విషయంలో ఆమెకు షరతులు విధించలేమని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి విడాకులు తీసుకోవచ్చని సూచించింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 02 , 2024 | 07:14 PM