భోపాల్‌లో రూ.1,814 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ABN, Publish Date - Oct 07 , 2024 | 04:00 AM
దేశ రాజధాని ఢిల్లీలో రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్ కుంభకోణం కలకలం ఇంకా సర్దుమణక ముందే.. భోపాల్‌లో మరో మాదకద్రవ్యాల వ్యవహారం వెలుగుచూసింది.
907 కేజీల మెఫెడ్రోన్ సీజ్ చేసిన గుజరాత్ ఏటీఎస్
అహ్మదాబాద్, అక్టోబరు 6: దేశ రాజధాని ఢిల్లీలో రూ.6,500 కోట్ల విలువైన డ్రగ్స్ కుంభకోణం కలకలం ఇంకా సర్దుమణక ముందే.. భోపాల్‌లో మరో మాదకద్రవ్యాల వ్యవహారం వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివార్లలోని ఓ ఫ్యాక్టరీలో రూ.1,814 కోట్ల విలువైన మెఫెడ్రోన్ (ఎండీ), దాని ముడిసరుకు భారీస్థాయిలో పట్టుబడింది. బగ్రోడా ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న ఫ్యాక్టరీలో శనివారం గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఢిల్లీలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో ఘన, ద్రవ రూపాల్లో ఉన్న 907.09 కేజీల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకన్నట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. సోదాల సందర్భంగా అమిత్ చతుర్వేది (57), సన్యాల్ ప్రకాశ్ బానె (40) అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - Oct 07 , 2024 | 04:00 AM