Ratan Tata: విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిన భారత్
ABN, Publish Date - Oct 10 , 2024 | 02:15 PM
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు రతన్ టాటా ముని మనవడు. 1937, డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూని టాటా, నావల్ టాటా. అయితే రతన్ టాటా పదేళ్ల వయస్సులో తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన నాయనమ్మ నవాజ్‌బాయ్ టాటా వద్ద రతన్ పెరిగారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దిగ్గజ పారిశ్రామిక వేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా మరణంతో భారత్ విలువ కట్టలేని రత్నాన్ని కోల్పోయిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. రతన్ టాటా మరణంతో భారతీయులు తీవ్ర విచారంలో ముగినిపోయారని తెలిపారు. భారతదేశాభివృద్ధిలో ఆయన పోషించిన కీలక పాత్రను దేశ ప్రజలు నిరంతరం గుర్తించుకుంటారన్నారు.
ముఖ్యమైన రంగాల్లో పలు పరిశ్రమలు నేలకొల్పడంతోపాటు అందులో ఆయన అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పారని చెప్పారు. సమాజ హితం కోసం అయన భాగస్వామ్యంతోపాటు సహాకారన్ని సైతం కొనసాగించిన విషయాన్ని ఈ సందర్బంగా మోహన్ భగవత్ వివరించారు. అలాగే దేశ ఐక్యత, భద్రత గురించే కాకుండా.. సంస్థలోని ఉద్యోగుల ప్రయోజనాలను సైతం ఆలోచించేవారని ఆయన పేర్కొన్నారు.
తన ప్రత్యేక ఆలోచనలే కాకుండా.. పని విధానంతో రతన్ టాటా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని వివరించారు. రతన్ టాటా అత్యున్నత శిఖరాలను చేరిన కూడా.. ఆయన నిరాడంబరత్వంతోపాటు మానవత్వాన్ని కలిగి ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రతన్ టాటా పవిత్ర స్మృతులకు ఈ సందర్బంగా ఆయన వినయ పూర్వక నమస్కారాలు తెలిపారు.
అలాగే ఆయన ఆత్మకు భగవంతుడు మోక్షం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. టాటీ సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ.. ముంబయి బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం రాత్రి 11.30 గంటలకు రతన్ టాటా మరణించారు.
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు రతన్ టాటా ముని మనవడు. 1937, డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూని టాటా, నావల్ టాటా. అయితే రతన్ టాటా పదేళ్ల వయస్సులో తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన నాయనమ్మ నవాజ్‌బాయ్ టాటా వద్ద రతన్ పెరిగారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.
ఆ తర్వాత.. 1961లో భారత్ తిరిగి వచ్చిన రతన్ టాటా.. తన సంస్థ గ్రూప్‌లో చేరారు. అలా టాటా స్టీల్స్‌లో చిరుద్యోగిగా చేరిన ఆయన.. విభిన్న హోదాల్లో పని చేశారు. అలాగే 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్‌చార్జిగా.. 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ఆయన పలు బాధ్యతలు నిర్వర్తించిన విషయం విధితమే.
For National News And Telugu News
Updated Date - Oct 10 , 2024 | 02:15 PM