ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Republic day 2024: ప్రేమతో రష్యా..!! వెరైటీగా భారత్‌కు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

ABN, Publish Date - Jan 26 , 2024 | 12:12 PM

రష్యా రాయబార కార్యాలయం భారతదేశానికి డిఫరెంట్‌గా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసింది. బాలీవుడ్ ఫేమస్ పాటకు చిన్నారుల డ్యాన్స్ చేసే వీడియోను సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా రష్యా రాయబార కార్యాలయం భారతదేశానికి డిఫరెంట్‌గా శుభాకాంక్షలు తెలియజేసింది. బాలీవుడ్ ఫేమస్ పాటకు చిన్నారుల డ్యాన్స్ చేసే వీడియోను సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 1.29 నిమిషాలు గల ఆ వీడియోలో పిల్లలు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు, ఉద్యోగులు ఉన్నారు. బాలీవుడ్ మూవీ ‘గదర్’ సినిమాలో ‘గడ్డి లేకే పాట’ అనే పాటకు వారంతా కలిసి హుషారుగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.

వీడియో అదిరింది

ఓ రష్యన్ బైకర్ రావడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. బైక్ మీద రౌండ్ తిరిగిన తర్వాత మిగతావారు డ్యాన్స్ ప్రారంభిస్తారు. ఓ రష్యన్ అమ్మాయి మధ్యలో ఉండి డ్యాన్స్ స్టార్ట్ చేశారు. తర్వాత మిగతా వారు చక్కగా కాలు కదిపారు. భారతీయ డ్యాన్సర్ల మాదిరిగా డ్యాన్స్ చేశారు. స్టెప్పులు వేసే సమయంలో పిల్లలు టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వలేదు. కొందరు పిల్లలు వెనకాల ఉండి భారత జాతీయ జెండా పట్టుకొని ఊపారు. చివరలో కొందరు హ్యాపీ రిపబ్లిక్ డే అని ఫ్ల కార్డులను పట్టుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. చాలామంది డ్యాన్స్ చేస్తున్నప్పటికీ ఎక్కడ స్టెప్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఆడారు.

ప్రేమతో రష్యా శుభాకాంక్షలు

భారతదేశానికి ప్రేమతో రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘రిపబ్లిక్ డే సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, భారతీయ స్నేహితులకు మంచి జరగాలి, భారత్‌దేశానికి అమృత్ కాల్ శుభాకాంక్షలు. భారతదేశం- రష్యా స్నేహం ఇలాగే కొనసాగాలి అని’ ట్వీట్‌లో అలిపోవ్ రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 26 , 2024 | 12:12 PM

Advertising
Advertising