Sanjay Dutt: రాజకీయాల్లోకి రావడంపై సంజయ్‌దత్ స్పష్టత..
ABN, Publish Date - Apr 08 , 2024 | 04:01 PM
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి రానున్నారా? ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో హర్యానా నుంచి ఆయన పోటీ చేయనున్నారా? కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ ఊహాగానాలకు సంజయ్ దత్ సోమవారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదకగా జవాబిచ్చారు. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) రాజకీయాల్లోకి రానున్నారా? ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) హర్యానా (Haryana) నుంచి ఆయన పోటీ చేయనున్నారా? కొద్దిరోజులుగా వినిపిస్తున్న ఈ ఊహాగానాలకు సంజయ్ దత్ సోమవారంనాడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదకగా జవాబిచ్చారు. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారనే ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ఏ పార్టీలోనూ తాను చేరడం కానీ, పోటీ చేయడం కానీ లేదని చెప్పారు. ఒకవేళ రాజకీయాల్లోకి రావడమంటూ ఉంటే దానిపై తానే స్వయంగా ప్రకటన చేస్తానని చెప్పారు. అంతవరకూ రాజకీయాల్లోకి వస్తున్నాననే వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు.
Kangana Ranaut: నేను గొడ్డు మాంసం తినను.. కాంగ్రెస్ నేతకు కంగనా స్ట్రాంగ్ కౌంటర్..
దత్ తండ్రి మంత్రి, సోదరి ఎంపీ
సంజయ్ దత్ కుటుంబానికి రాజకీయాలతో సంబంధం ఉంది. ఆయన తండ్రి దివంగత సునీల్ దత్ గతంలో మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీగా, ముంబై మంత్రిగా పనిచేశారు. సంజయ్ దత్ సోదరి ప్రియాదత్ కూడా ఎంపీగా పనిచేశారు. కాగా, హర్యానాతో సంజయ్‌దత్‌కు అనుబంధం ఉంది. ఆయన పూర్వీకుల గృహం హర్యానాలోని యమునానగర్‌లో ఉంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హర్యానాలోని కర్నాల్ నియోజకవర్గం నుంచి బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం కాంగ్రెస్ వెతుకుతోంది. దీంతో సంజయ్‌దత్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అదీగాక ఐఎన్ఎల్‌డీ నేత అభయ్ సింగ్ తరఫున గతంలో పలుమార్లు సంజయ్‌దత్ హర్యానాలో ప్రచారం చేశారు. దీంతో సంజయ్ దత్ ఈసారి పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే పుకార్లు షికారు చేశాయి. అయితే, అలాంటిదేమీ లేదంటూ ఆ ఊహాగానాలకు సంజయ్ దత్ తాజాగా తెరదించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 08 , 2024 | 04:01 PM