ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sanjay Roy : నేను వెళ్లేసరికే ఆమె చనిపోయి ఉంది

ABN, Publish Date - Aug 27 , 2024 | 05:28 AM

కోల్‌కతా హత్యాచార ఘటన నిందితుడు సంజయ్‌ రాయ్‌.. పాలీగ్రాఫ్‌ పరీక్షలో ఒకదానికొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పాడు.

  • పాలీగ్రాఫ్‌ పరీక్షలో ఆర్జీ కర్‌ ఆస్పత్రి

  • హత్యాచార నిందితుడు సంజయ్‌ రాయ్‌

కోల్‌కతా, ఆగస్టు 26: కోల్‌కతా హత్యాచార ఘటన నిందితుడు సంజయ్‌ రాయ్‌.. పాలీగ్రాఫ్‌ పరీక్షలో ఒకదానికొకటి సంబంధం లేని సమాధానాలు చెప్పాడు. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న అతడికి ఇటీవల సీబీఐ పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించింది.

అందులో.. తాను ఈ నెల 9న రాత్రి తాను ఆస్పత్రికి వెళ్లేసరికే సెమినార్‌ హాలులో యువ వైద్యురాలు చనిపోయి కనిపించిందని..

భయంతో పారిపోయానని సంజయ్‌ చెప్పాడు. అయితే, ఆధారాలు చూపించడంతో అసలు తాను అక్కడ లేనంటూ బుకాయించాడు. విచారణ సందర్భంగా సీబీఐ ప్రశ్నలకు ఏదో ఆలోచిస్తూ.. హడావుడి పడ్డాడు. అవాస్తవాలు, పొంతన లేకుండా మాట్లాడాడు.


ఈ నెల 10న సంజయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేసిన సమయంలో హత్యాచారం చేసింది తానేనంటూ అంగీకరించినట్లుగా కథనాలు వచ్చాయి. ఫోరెన్సిక్‌ వైద్య బృందం విచారణ సందర్భంగానూ ఆస్పత్రిలో ఆ రోజు ఏం జరిగిందో వివరంగా చెప్పాడని సీబీఐ పేర్కొంది.

కానీ, కోర్టుకు తీసుకెళ్లాక తనను కొందరు కేసులో ఇరికించారంటూ మాట మార్చాడు. కాగా, సంజయ్‌కు మళ్లీ పాలీగ్రాఫ్‌ పరీక్షలు చేయనున్నారు. మరోవైపు ఆర్జీ కర్‌ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ సంజయ్‌ సహా మరో నలుగురికి సోమవారం నుంచి రెండో దఫా పాలీగ్రాఫ్‌ పరీక్షలు చేస్తున్నారు.

Updated Date - Aug 27 , 2024 | 05:28 AM

Advertising
Advertising
<