ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sanjay Roy : కావాలంటే ఉరి తీసుకోండి!

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:55 AM

ధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి.. ఆమె ప్రాణాన్ని బలిగొన్నానన్న దోష భావన లేదు! దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం లేదు!! పోలీసులు తనను పట్టుకున్నప్పుడు కూడా అతడి కళ్లల్లో ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు! వారు తనను ప్రశ్నిస్తున్నప్పుడు నిర్వికారంగా సమాధానాలు చెప్పాడు.

  • ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి వ్యాఖ్యలు

  • ఆ ఘోరానికి పాల్పడడానికి ముందు 2 సార్లు రెడ్‌లైట్‌ ఏరియాకు

  • హత్యాచారం తర్వాత ఇంటికి వెళ్లి.. నిద్ర

కోల్‌కతా, న్యూఢిల్లీ, ఆగస్టు 12: విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి.. ఆమె ప్రాణాన్ని బలిగొన్నానన్న దోష భావన లేదు! దొరికిపోతే శిక్ష పడుతుందన్న భయం లేదు!! పోలీసులు తనను పట్టుకున్నప్పుడు కూడా అతడి కళ్లల్లో ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు! వారు తనను ప్రశ్నిస్తున్నప్పుడు నిర్వికారంగా సమాధానాలు చెప్పాడు.

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడడానికి ముందు రెండుసార్లు రెడ్‌లైట్‌ ఏరియాలకు (కాళీఘాట్‌, సోవాబజార్‌) వెళ్లినట్టు చెప్పాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకొని.. ‘‘అమీ ఫాసీ దీయే దీ (కావాలంటే నన్ను ఉరి తీసుకోండి)’’ అని చెప్పాడు!! కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో పీజీ ట్రైనీ డాక్టర్‌(31)పై హత్యాచారం జరిపిన నిందితుడు సంజయ్‌ రాయ్‌ తీరు ఇది! అతడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దాన్ని పరిశీలించగా.. దాన్నిండా అశ్లీల చిత్రాలే కనిపించాయి.

ఆమెపై హత్యాచారం జరిపిన తర్వాత నింపాదిగా ఇంటికి వెళ్లిన సంజయ్‌రాయ్‌.. హాయిగా నిద్రపోయి, ఉదయం 9 గంటలకు లేచి.. రక్తపుమరకలున్న తన దుస్తులను తీరిగ్గా ఉతుక్కున్నాడని కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ తెలిపారు. అయితే, అతడి బూట్లపై రక్తపు మరకలను తాము గుర్తించామని ఆయన వెల్లడించారు.

సంజయ్‌రాయ్‌ ఆమెను తొలుత హత్య చేసి.. అనంతరం మృతదేహంపై లైంగికదాడికి పాల్పడ్డాడనడానికి కొన్ని ఆధారాలున్నట్టు మరో పోలీసు అధికారి చెప్పడం గమనార్హం. అతడి చేతిలో హత్యాచారానికి గురైన ఆ జూనియర్‌ వైద్యురాలు.. ఆరోజు రాత్రి 12 గంటల సమయంలో తన తోటి ట్రైనీ డాక్టర్లు మరో ముగ్గురితో కలిసి ఒలింపిక్స్‌లో నీరజ్‌చోప్రా రజత పతక ప్రదర్శనను కూడా చూసింది. రాత్రి భోజనం పూర్తయ్యాక వారు ముగ్గురూ తమ విధులు నిర్వర్తించడానికి వెళ్లగా.. ఆమె చదువుకోవడానికి సెమినార్‌హాల్లోనే ఒంటరిగా ఉండిపోయింది. అదే సంజయ్‌రాయ్‌కి అవకాశంగా మారింది.


సివిల్‌ వాలంటీర్‌..

సంజయ్‌ రాయ్‌ అసలు ఆర్జీ కర్‌ ఆస్పత్రి ఉద్యోగి కాదు. కోల్‌కతా పోలీసు విభాగంలో సివిక్‌ వాలంటీర్‌గా పనిచేసేవాడు. సివిక్‌ వాలంటీర్‌ అంటే.. కాంట్రాక్ట్‌ సిబ్బంది. ట్రాఫిక్‌ నిర్వహణ, విపత్తు స్పందన విభాగాల్లో రూ.12 వేల జీతానికి వీరిని నియమిస్తారు. సంజయ్‌రాయ్‌ అలా తొలుత విపత్తు స్పందన విభాగంలో వాలంటీర్‌గా 2019లో చేరాడు.

తర్వాత అతణ్ని పోలీస్‌ సంక్షేమ విభాగానికి మార్చారు. తర్వాత.. ఆర్జీ కర్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలోని పోలీస్‌ ఔట్‌పోస్టులో డ్యూటీ వేశారు. అక్కడ అతను.. రోగుల నుంచి డబ్బులు తీసుకుని బెడ్‌ ఇప్పించడం వంటి దందాలు చేసేవాడు. ఈ క్రమంలోనే ట్రైనీ డాక్టర్‌పై కన్నేశాడు.

కాగా, ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించాలని పోలీసులను బెంగాల్‌ సీఎం మమత ఆదేశించారు. మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించిన ఆమె.. ‘‘వచ్చే ఆదివారం కల్లా కేసును ఛేదించలేకపోతే.. దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తాం. సీబీఐకి ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదుగానీ.. ఆ సంస్థ విజయాల శాతం చాలా తక్కువ’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఇంత ఘోరానికి పాల్పడినవారికి మరణ శిక్ష పడేలా చేస్తానన్నారు.

ఈ కేసు విచారణ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో జరగాలని పేర్కొన్నారు. ఇక.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కలకత్తా హైకోర్టులో మూడు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మంగళవారం అవి విచారణకు రానున్నాయి. కాగా.. జాతీయ మహిళా కమిషన్‌కు చెందిన ఇద్దరు సభ్యుల బృందం సోమవారం మధ్యాహ్నం కోల్‌కతాకు చేరుకుని నగర పోలీసు కమిషనర్‌తో మాట్లాడారు. మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు.


గాంధీలో నిరసన

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు కొవ్వత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌, ఆర్‌ఎంఎల్‌ సహా పలు ఆస్పత్రుల్లోని రెసిడెంట్‌ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

ఈ దీక్ష జరిగినన్నాళ్లూ ఓపీ విభాగాలు, ఆపరేషన్‌ థియేటర్లు, వార్డు డ్యూటీలను నిలిపివేస్తామని ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌’ వెల్లడించింది. అత్యవసర వైద్యసేవలను మాత్రం అందిస్తామని తెలిపింది.

ఆర్జీ కర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ను తక్షణం తొలగించాలని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసింది. అయితే.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌ ప్రకటించారు.

Updated Date - Aug 13 , 2024 | 04:57 AM

Advertising
Advertising
<