ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Haryana: కాంగ్రెస్‌ను వీడిన రిచ్చెస్ట్ మహిళ.. ఏ పార్టీలో చేరారంటే

ABN, Publish Date - Mar 28 , 2024 | 05:51 PM

దేశంలోనే అత్యంత ధనవంతమైన మహిళగా పేరు పొందిన సావిత్రి జిందాల్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఈ మధ్యే కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు కురుక్షేత్ర నుంచి లోక్ సభ ఎన్నికలకు టికెట్ కేటాయించింది.

చండీగఢ్: దేశంలోనే అత్యంత ధనవంతమైన మహిళగా పేరు పొందిన సావిత్రి జిందాల్ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఆమె కుమారుడు, పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్ ఈ మధ్యే కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ ఆయనకు కురుక్షేత్ర నుంచి లోక్ సభ ఎన్నికలకు టికెట్ కేటాయించింది.

అయితే కొన్నాళ్లపాటు సావిత్రి కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. బుధవారం అర్థరాత్రి సోషల్ మీడియా పోస్ట్‌లో ఆమె కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించి గురువారం బీజేపీలో చేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. "నేను హిస్సార్ నియోజకవర్గంలో10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను.


హర్యానాకు కొన్నేళ్లు మంత్రిగానూ పని చేశాను. హిసార్ ప్రజలు నా కుటుంబం. నా కుటుంబ సభ్యుల సలహా మేరకు, నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను" అంటూ హిందీలో పోస్ట్ చేశారు.

కొద్ది రోజుల క్రితం సావిత్రి కుమారుడు మాజీ ఎంపీ నవీన్ జిందాల్ కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, హర్యానా మాజీ మంత్రి ఓపీ జిందాల్ కుమారుడు నవీన్.. కురుక్షేత్ర నుంచి ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 05:53 PM

Advertising
Advertising