Rahul Gandhi: రామాలయం ఈవెంట్‌లో పెద్దోళ్లకే కానీ పేదలకు ప్లేస్ ఏదీ..?
ABN, Publish Date - Feb 12 , 2024 | 09:14 PM
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ప్రముఖ వాణిజ్యవేత్తలు వంటివారే కనిపించారని, చూద్దామన్నా ఎక్కడా పేదలు, కార్మికులు, రైతులు కనిపించ లేదని అన్నారు.
కోర్బా: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి కేంద్రంలోని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ప్రముఖ వాణిజ్యవేత్తలు వంటివారే కనిపించారని, చూద్దామన్నా ఎక్కడా పేదలు, కార్మికులు, రైతులు కనిపించ లేదని అన్నారు.
'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ చౌక్‌లో ప్రజలను ఉద్దేశించి రాహుల్ సోమవారంనాడు మాట్లాడుతూ, జనవరి 22న జరిగిన రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఒక్క పేదవాడినైనా ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అంబానీ, అదానీ, ఇతర వాణిజ్య ప్రముఖులనే తనకు కనిపించారనీ, ఒక్క రైతు, కూలీ, ఉద్యోగి, కనీసం చిన్న దుకాణదారు కూడా కనిపించలేదన్నారు. బిలయనీర్లంతా మీడియా ముందు సుదీర్ఘ ప్రసంగాలిచ్చారని అన్నారు. రామాలయం ప్రతిష్ఠాపన వంటి కార్యక్రమంలో అసమానత్వం తగదని, పేద ప్రజలు ప్రతిరోజూ జీవనపోరాటం ఎదుర్కొంటూనే ఉన్నారని అన్నారు.
Updated Date - Feb 12 , 2024 | 09:37 PM