Supreme Court: 'ఎలక్టోరల్ బాండ్ల'పై సిట్ విచారణకు సుప్రీం నిరాకరణ
ABN, Publish Date - Aug 02 , 2024 | 04:41 PM
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపాలించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ దాతల మధ్య 'క్విడ్ ప్రో కో' జరిగిందంటూ వచ్చిన ఆరోపణలో సిట్ దర్యాప్తు జరిపించాలని రెండు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం విచారించింది.
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల (Electoral bonds)పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపాలించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారం తోసిపుచ్చింది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ దాతల మధ్య 'క్విడ్ ప్రో కో' (quid pro quo) జరిగిందంటూ వచ్చిన ఆరోపణలో సిట్ దర్యాప్తు జరిపించాలని రెండు స్వచ్ఛంద సంస్థలు (NGO) దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సర్వోన్నత న్యా్యస్థానం విచారించింది. సాధారణ చట్టం కింద చర్యలు తీసుకునే మార్గాలు ఉన్నందున దీనిపై మాజీ న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం సరికాదని, ఆర్టికల్ 32 కింద ఈ దశలో జోక్యం చేసుకోలేమని సీజైఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సిట్ విచారణకు నిరాకరించింది.
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు గత ఫిబ్రవరి 15న సంచలన తీర్పునిచ్చింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, సమాచార హక్కు చట్టం ఆర్టికల్ 19(1)ను ఉల్లంఘించడమే అవుతుందని తీర్పు వెలువరించింది. బ్యాంకులు తక్షణమే ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం కూడా ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడమనని పేర్కొంది.
Supreme Court: సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్‌కు చుక్కెదురు..
ఈ ఎన్నికల బాండ్ పథకం 2018లో అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు విరాళాల గురించి బహిర్గతం చేయనవసరం లేదని అందులో పేర్కొంది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించడంతో పాటు కేంద్రానికి నోటీసులు పంపింది.
Read Latest Telangana News and National News
Updated Date - Aug 02 , 2024 | 04:41 PM