ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi Video: విద్యార్థులతో మోదీ రాఖీ వేడుకలు..

ABN, Publish Date - Aug 19 , 2024 | 01:01 PM

దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తున్నారు. ప్రధాని మోదీ(PM Modi) సైతం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

ఢిల్లీ: దేశవ్యాప్తంగా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తున్నారు. ప్రధాని మోదీ(PM Modi) సైతం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ ఉదయాన్నే ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్లిన మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

అనంతరం చిన్నారులంతా ఒక్కొక్కరుగా వచ్చి మోదీ చేతికి రాఖీలు కట్టారు. సందర్భానుసారం విభిన్న వేశధారణతో ఆకట్టుకునే మోదీ రాకీ పండగకు కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. మోదీ ధరించిన దుస్తులు నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆయన ఇవాళ తెల్లటి కుర్తా, లేత ఆకుపచ్చ జాకెట్ ధరించి ఉన్నారు.


చెల్లికి శుభాకాంక్షలు తెలిపిన రాహుల్..

లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన సోదరి ప్రియాంక గాంధీకి(Priyanka Gandhi) రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

"సోదర సోదరీమణుల మధ్య విడదీయరాని ప్రేమ, అనురాగాలను తెలియజేసే పండుగ రక్షాబంధన్. దేశ ప్రజలకు రాకీ పండుగ శుభాకాంక్షలు. రక్షా బంధన్ ఎల్లప్పుడూ మీ పవిత్ర బంధాన్ని దృఢంగా ఉంచాలని కోరుకుంటున్నా " అని రాహుల్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

For Latest News and National News click here

Updated Date - Aug 19 , 2024 | 01:02 PM

Advertising
Advertising
<