ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manipur: కొనసాగుతున్న ఉద్రిక్తత.. నేడు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ బంద్

ABN, Publish Date - Sep 11 , 2024 | 09:38 AM

మణిపూర్‌(Manipur)లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న నిరసనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిషేధించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 11, 12న పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Manipur protest

మణిపూర్‌(Manipur) రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రాజ్‌భవన్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, మహిళా ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు. మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారుని, డిజిపిని తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున, ఖ్వైరాంబండ్ మహిళా బజార్‌లో సోమవారం నుండి క్యాంప్‌ చేస్తున్న వందలాది మంది విద్యార్థులు బిటి రోడ్డు మీదుగా రాజ్‌భవన్ వైపు కవాతు చేయడానికి ప్రయత్నించారు, అయితే కాంగ్రెస్ భవన్ సమీపంలో భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.


సెప్టెంబర్ 15 వరకు

మణిపూర్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. BNSS సెక్షన్ 163 (2) ప్రకారం తౌబాల్‌లో నిషేధాజ్ఞలు విధించబడ్డాయి. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు కూడా సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో మూసివేయబడతాయని ప్రకటించారు. హోం కమిషనర్ ఎన్. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్ కక్చింగ్ అనే ఐదు జిల్లాల్లో ఐదు రోజుల పాటు (సెప్టెంబర్ 15 వరకు) మొబైల్ ఇంటర్నెట్ నిలిపివేయబడుతుందని వెల్లడించారు.


12 మంది మృతి

రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ నిషేధించబడింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చెందకుండా నిరోధించడం కోసం శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి వివిధ జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మహిళలు, వృద్ధులు, రిటైర్డ్ సైనికులతో సహా కనీసం 12 మంది వ్యక్తులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ 12 మరణాల్లో దక్షిణ అసోంకు ఆనుకుని ఉన్న జిరిబామ్ జిల్లాలోనే ఆరుగురు మరణించారు. ఇటీవల రాజధాని ఇంఫాల్‌లో డ్రోన్ దాడులకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసనకారులు రాజ్‌భవన్‌, సీఎం నివాసానికి చేరుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు, భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.


మే 2023 నుంచి

మణిపూర్‌లో హింస మే 2023లో ప్రారంభమైంది. ఇందులో ఇప్పటి వరకు 226 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కుకీలు, మెయిటీల మధ్య రిజర్వేషన్ వివాదంతో రాష్ట్రంలో హింస ప్రారంభమైంది. ఇది ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. కానీ ఇది ఇప్పట్లో ఆగిపోయే సూచనలు మాత్రం కనిపించడం లేదు.


ఇవి కూడా చదవండి:

TRAI: కోటికిపైగా ఫేక్ మొబైల్ కనెక్షన్‌లు తొలగింపు.. కారణమిదే..

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

Swiggy IPO: త్వరలో స్విగ్గీ ఐపీఓ.. ఎన్ని కోట్ల షేర్లు, ఎప్పటి నుంచంటే..


Read MoreNational News and Latest Telugu News

Updated Date - Sep 11 , 2024 | 09:42 AM

Advertising
Advertising