ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Scientists : గోదావరి బేసిన్‌లో చమురు నిక్షేపాలు..!

ABN, Publish Date - Sep 16 , 2024 | 03:58 AM

గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భూభాగంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని బీర్బల్‌ సాహ్ని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియోసైన్సెస్‌ (బీఎ్‌సఐపీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

లఖ్‌నవూ, సెప్టెంబరు 15: గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని భూభాగంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని బీర్బల్‌ సాహ్ని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాలియోసైన్సెస్‌ (బీఎ్‌సఐపీ) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇవి సాధారణంగా సముద్ర క్రమంలో కనిపిస్తాయని, కానీ.. భూభాగంలో వీటి లభ్యతను గుర్తించడం సవాలుతో కూడుకున్న అంశమని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త నేహా అగర్వాల్‌ తెలిపారు. ‘పాలియో ఎన్విరాన్‌మెంట్‌ (గత పర్యావరణం)ను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో నిక్షిప్తమైన బొగ్గు, రాతి పొరలు సహా మరిన్ని అవక్షేపాలను అధ్యయనం చేశారు. పరిశోధనలో ఆర్గానిక్‌ కార్బన్‌ పరిమాణాన్ని కొలిచారు. ఈ క్రమంలో హైడ్రోకార్బన్‌ ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్లాంక్టానిక్‌ జీవుల నిక్షేపణను గుర్తించారు. కాబట్టి ఈ హైడ్రోకార్బన్‌లో చమురు, సహజవాయువులు ఉంటాయి’ అని అగర్వాల్‌ తెలిపారు.

Updated Date - Sep 16 , 2024 | 03:58 AM

Advertising
Advertising