India-Canada: ఉగ్రవాదులు, వేర్పాటు వాదులను ఉపేక్షించొద్దు... కెనడాలో దాడి ఘటనపై భారత్
ABN, Publish Date - Nov 04 , 2024 | 08:53 PM
హింస, దాడులు వంటి చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కౌన్సిలర్ సేవలపై రణదీప్ జైశ్వాల్ మాట్లాడుతూ, ఎలాటి దాడులు, వేధింపులు, హింసకు భారత దౌత్యవేత్తలు లొంగరని చెప్పారు. కెనడాలో భారతీయులకు కాన్సులర్ సేవకు కొనసాగిస్తామని తెలిపారు.
న్యూఢిల్లీ: భారత్, కెనడా (India-Canada) మధ్య ఉద్రక్తతల నేపథ్యంలో బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్థానీలు దాడి ఘటన మరింత ఆజ్యం పోసింది. దీనిపై భారత్ ప్రభుత్వం తీవ్ర సోమవారంనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందు సభ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగిన ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
MiG-29 Fighter Jet: ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 విమానం
''బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయం వద్ద తీవ్రవాదులు, వేర్పాటువాదులు హింసాత్మక చర్యలకు పాల్పడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తరహా దాడుల నుంచి అన్ని ప్రార్థనా స్థలాలను సంరక్షించాలని మేము కెనడా ప్రభుత్వా్న్ని కోరుతున్నాం. హింసను ప్రోత్సహిస్తున్న వారిని, ఇందుకు పాల్పడుతున్న వారిని ప్రాసిక్యూట్ చేస్తారని ఆశిస్తున్నాం. కెనడాలోని భారతీయుల భద్రతపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాం'' అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
కాన్సులర్ సేవలు కొనసాగుతాయి
హింస, దాడులు వంటి చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కౌన్సిలర్ సేవలపై రణదీప్ జైశ్వాల్ మాట్లాడుతూ, ఎలాటి దాడులు, వేధింపులు, హింసకు భారత దౌత్యవేత్తలు లొంగరని చెప్పారు. కెనడాలో భారతీయులకు కాన్సులర్ సేవకు కొనసాగిస్తామని తెలిపారు.
బ్రాంప్టన్‌లోని ఆలయ కాంప్లెక్స్‌లో భక్తులపై ఖలీస్థానీలు కొందరు దాడులు చేస్తున్న వీడియో వైరల్ కావడంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారంనాడు స్పందించారు. కెనడాలోని ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ మత సంప్రదాయాలను పాటించుకునే హక్కు ఉందని అన్నారు. హిందూ సభ మందిర్‌పై హింసాత్మక ఘటన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. దాడి ఘటనపై సత్వరమే స్పందించి విచారణ చేపట్టడిన పీల్ రీజినల్ పోలీసులను అభినందించారు.
ఇది కూడా చదవండి..
Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ బుకింగ్, ట్రాకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 04 , 2024 | 08:53 PM