ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lightning Effect: పిడుగుపాటుతో ఏడుగురు మృతి, మరో ముగ్గురికి గాయాలు

ABN, Publish Date - Sep 08 , 2024 | 07:51 PM

పొలంలో పని చేస్తుండగా ఆకస్మాత్తుగా జోరు వాన కురిసింది. దీంతో కూలీలు కాస్తా చెరువు ఒడ్డున ఉన్న చెట్టు నీడకు వెళ్లారు. అదే సమయంలో పిడుగు రూపంలో ప్రకృతి వారిపై ప్రకోపించింది. దీంతో ఏడుగురు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.

Lightning Effect Seven dead

దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు(rains) జోరుగా కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆకస్మాత్తుగా పిడుగుపాటు సంభవించి ఏడుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh) బలోదబజార్ భాటపరా జిల్లాలో సెప్టెంబర్ 8న మధ్యాహ్నం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే వర్షం ఎక్కువగా వస్తుందని పొలంలో పనిచేసే కూలీలు చెరువు ఒడ్డుకు చేరుకుని చెట్ల కింద ఉన్నారు. అదే సమయంలో వారిపై పిడుగు పడిందని అధికారులు తెలిపారు.


విషాధ చాయలు

ఇక ప్రమాదంలో మరణించిన వారిని ముఖేష్ (20), టంకర్ సాహు (30), సంతోష్ సాహు (40), థానేశ్వర్ సాహు (18), పోఖరాజ్ విశ్వకర్మ (38), దేవ్ దాస్ (22), విజయ్ సాహు (23)లుగా గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వారి కుటుంబాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి. బోరున విలపిస్తూ తమకు సాయం చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది చూడాలి మరి.


రెండు రోజుల క్రితం కూడా..

కేవలం రెండు రోజుల క్రితం దంతెవాడ జిల్లాలోని పారామిలటరీ దళానికి చెందిన యాంటీ నక్సల్ శిక్షణా కేంద్రంలో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సైనికులు పిడుగుపాటుకు మరణించారు. జిల్లాలోని బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో శిక్షణా కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. ఆ క్రమంలో సీఆర్‌పీఎఫ్‌లోని 111వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్లు మహేంద్ర కుమార్, ఎస్ సాహువాత్ ఆలం పిడుగుపాటుకు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ అంబులెన్స్‌లో దంతెవాడ ఆసుపత్రికి తరలించారు. కానీ పరీక్షించిన అనంతరం వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.


ఇవి కూడా చదవండి:

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..


Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..


Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..


Read MoreNational News and Latest Telugu News

Updated Date - Sep 08 , 2024 | 07:55 PM

Advertising
Advertising