ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి

ABN, Publish Date - Nov 04 , 2024 | 11:30 AM

గర్వాల్ మోటార్‌కు సంస్థకు చెందిన బస్సు ఉత్తరాఖండ్‌లోని లోయలో పడిపోయింది. స్థానికులు అధికారులకు సమాచారం అదించారు. ఎస్‌డీఆర్ఎఫ్, పోలీసులు వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారని తెలిపారు.

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అల్మోరా సరిహద్దు వద్ద రామ్‌నగర్‌లోని కుపి సమీపంలో ఇవాళ(సోమవారం) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఎస్‌డీఆర్ఎఫ్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీస్తుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి అంబులెన్స్‌ కూడా చేరుకుంది. గర్వాల్ మోటార్‌కు సంస్థకు చెందిన బస్సుగా అధికారులు తేల్చారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన స్థలంలో ఏడుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచానా వేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


సహాయక చర్యలు చేపట్టాలి: సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి

ఓవర్‌లోడ్‌ కారణంతోనే బస్సు లోయలో పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, క్షతగాత్రులను ఆస్ప త్రికి తరలిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను వెంటనే ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆర్టీఓ సస్పెండ్

పౌరీ - అల్మోరా సంబంధిత ప్రాంతం ఆర్టీఓను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కమిషనర్ కుమాన్ డివిజన్‌ను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వారి కోసమే రెడ్‌బుక్.. హోం మంత్రి

84 వేల కోట్ల పెట్టుబడులు 5 లక్షల ఉద్యోగాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 04 , 2024 | 11:59 AM