Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అఫ్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి
ABN, Publish Date - Apr 19 , 2024 | 03:58 PM
ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. 164 సెక్షన్ కింద ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు.
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం ( Delhi ) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. 164 సెక్షన్ కింద ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసులో కూడా అప్రూవర్ గా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది.
AAP: కేజ్రీవాల్‌పై కుట్ర, జైలులో ఏదైనా జరగొచ్చు.. ఆప్ ఎంపీ సంచలన ఆరోపణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ, దినేష్ అరోరా అప్రూవర్ గా మారారు. ఆ జాబితాలో శరత్ చంద్రారెడ్డి చేరారు. తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సీబీఐ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు.
లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. తీహర్ జైలులో ఉన్న కవితపై సీబీఐ కూడా విచారించి, అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ కుట్రతోనే లిక్కర్ స్కాం జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది.
Amit Shah: కుల ఆధారిత రిజర్వేషన్లపై కీలక కామెంట్స్ చేసిన అమిత్ షా..
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 19 , 2024 | 04:55 PM