Delhi: స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన కాంగ్రెస్ సీనియర్ నేత పీఏ
ABN, Publish Date - May 30 , 2024 | 08:35 AM
బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీఏ ఒకరు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) వ్యక్తిగత సహాయకుడు(పీఏ) శివప్రసాద్ దుబాయి నుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీ: బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీఏ ఒకరు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor) వ్యక్తిగత సహాయకుడు(పీఏ) శివప్రసాద్ దుబాయి నుంచి భారత్‌కు బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా.. ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 3 వద్ద బుధవారం ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.కస్టమ్స్ వర్గాల సమాచారం ప్రకారం.. కుమార్ అతని సహచరులలో ఒకరు దుబాయ్ నుండి రాగా అతని బంగారాన్ని తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
దాదాపు రూ.30 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు. బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారని, భారత్‌కు ఎందుకు తరలిస్తున్నారని ఆరా తీశారు. అతని నుంచి సరైన స్పందన రాకపోవడంతో జైలుకి తరలించారు. కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ ప్రస్తుతం తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.
For Latest News and National News click here..
Updated Date - May 30 , 2024 | 08:36 AM