Jawaharlal Nehru: నెహ్రూ లేకుంటే దేశ చరిత్ర పూర్తి కాదు: సోనియా, ఖర్గే
ABN, Publish Date - May 27 , 2024 | 03:21 PM
దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం గుర్తు తెచ్చుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ విగ్రహాలకు రాజకీయ నాయకులు, పౌరులు నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివన్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు.
ఢిల్లీ: దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను దేశం గుర్తు తెచ్చుకుంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న నెహ్రూ(Jawaharlal Nehru) విగ్రహాలకు రాజకీయ నాయకులు, పౌరులు నివాళులు అర్పించారు.
సోమవారం ఉదయం ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివన్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ నివాళులు అర్పించారు. ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నెహ్రూ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్‌గాంధీ తమ ఎక్స్ అకౌంట్లలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెహ్రూ ప్రస్తావన లేకుండా భారతదేశ చరిత్ర పూర్తికాదని అన్నారు. ఆధునిక భారత దేశ నిర్మాణానికి ఆయన ఒక ఆర్కిటెక్ట్‌లా పనిచేశారని కొనియాడారు. దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
Read National News and Latest News here
Updated Date - May 27 , 2024 | 03:25 PM