ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: సోనియా కుటుంబంతో బంగ్లాదేశ్ ప్రధాని భేటీ.. ఎందుకంటే?

ABN, Publish Date - Jun 10 , 2024 | 06:29 PM

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సోమవారం ఢిల్లీలో కలిశారు.

ఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సోమవారం ఢిల్లీలో కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హసీనా సోమవారం స్వదేశానికి తిరిగి వెళ్లనుండగా.. హస్తినలో సోనియా కుటుంబ సభ్యులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హసీనా, సోనియా భేటీలో ఇరు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శనివారం ఢిల్లీకి చేరుకున్న షేక్‌ హసీనా ఆదివారం జరిగిన ప్రధాని మోదీ, ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.


అయితే హసీనా, గాంధీ కుటుంబానికి మధ్య ఏళ్లుగా అనుబంధం ఉంది. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత షేక్ ముజిబుర్ రెహమాన్, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో ఇందిరా గాంధీ కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ను విముక్తి చేశారు. ఆ దేశ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడంతో అప్పటి నుంచి ఇందిరా కుటుంబంతో వారికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 06:29 PM

Advertising
Advertising