Sonia Gandhi: రాజకీయ లబ్ధి కోసం మోదీ విద్వేషాలు: సోనియా
ABN, Publish Date - May 08 , 2024 | 10:15 AM
ప్రధాని మోదీ రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని సోనియాగాంధీ ఆరోపించారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యమని విమర్శించారు. మంగళవారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు.
న్యూఢిల్లీ, మే 7(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని సోనియాగాంధీ ఆరోపించారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాని మోదీ, బీజేపీ లక్ష్యమని విమర్శించారు. మంగళవారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు.
మోదీ, బీజేపీ విధానాల వల్ల దేశవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, వెనుకబడినవర్గాలు, మైనారిటీలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు అండగా నిలిచేలా తమ పార్టీ మేనిఫెస్టో రూపొందించామని వివరించారు. అసత్యాలు, విద్వేషాన్ని తిరస్కరించాలని, దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రజలకు సోనియా పిలుపునిచ్చారు.
Updated Date - May 08 , 2024 | 10:15 AM