ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sourav Ganguly: మీతో నేను.. డీపీ మార్చిన సౌరవ్ గంగూలీ

ABN, Publish Date - Aug 20 , 2024 | 05:30 PM

కోల్ కతా వైద్యురాలి మృతి ఘటన ప్రకంపనలు రేపుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని యావత్ భారతవని కోరుతోంది. వైద్యురాలి మృతికి సంఘీభావంగా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్టేటస్‌ను బ్లాక్ కలర్‌గా మార్చారు. తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేరారు.

Sourav Ganguly

కోల్ కతా: కోల్ కతా వైద్యురాలి మృతి ఘటన ప్రకంపనలు రేపుతోంది. నిందితులపై చర్యలు తీసుకోవాలని యావత్ భారతవని కోరుతోంది. వైద్యురాలి మృతికి సంఘీభావంగా పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో స్టేటస్‌ను బ్లాక్ కలర్‌గా మార్చారు. తమదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ (Sourav Ganguly) గంగూలీ చేరారు.



చర్చనీయాంశం.. ఆ వెంటనే

ట్రైనీ డాక్టర్ మృతిపై తొలుత గంగూలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ‘వైద్యురాలిపై లైంగికదాడి చేసి, హతమార్చడం దురదృష్టకరం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతను సమీక్షించాలి. కోల్ కతాలో జరిగిన ఒక్క ఘటనతో రాష్ట్రంపై చెడు అభిప్రాయానికి రాకూడదు అని’ సౌరవ్ గంగూలీ కామెంట్ చేశారు. కోల్ కతా గురించి తప్పుగా మాట్లాడొద్దని అతను చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పు పట్టారు. తీవ్ర విమర్శలు రావడంతో గంగూలీ మరోసారి స్పందించారు.



అబ్బే.. అది కాదు..

‘ఆ రోజు నేను చేసిన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారు. వైద్యురాలిపై జరిగిన ఘటన దారుణం. నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్‌లో మరొకరు దారుణానికి పాల్పడే సహసం చేయొద్దు అని’ గంగూలీ స్పష్టం చేశారు. ఆ వెంటనే వైద్యురాలికి తన సంఘీభావం తెలియజేశారు. సోషల్ మీడియా అకౌంట్లలో డీపీని నలుపు రంగుతో పోస్ట్ చేశారు. ప్రొఫైల్ ఫొటో స్థానంలో బ్లాక్ కలర్ ఉంచాడు. ఇది తన కొత్త ప్రొఫైల్ పిక్ అని రాసుకొచ్చారు.


రంగంలోకి సీబీఐ

కోల్ కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఈ నెల 9వ తేదీన వైద్యురాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. సంజయ్ రాయ్ అనే వ్యక్తి, ఇతరులు కలిసి లైంగికదాడికి తెగబడినట్టు తెలుస్తోంది. పోలీసులు సంజయ్ రాయ్ ఒక్కడినే అరెస్ట్ చేశారు. మిగతా వారిని అదుపులోకి తీసుకోవాలని వైద్యులు, సిబ్బంది నిరసనను ఉధృతం చేశారు. కోల్ కతా హైకోర్టు జోక్యంతో కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 20 , 2024 | 05:39 PM

Advertising
Advertising
<