Special trains: హోలీ పండుగ వేళ మూడు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ABN, Publish Date - Mar 16 , 2024 | 12:43 PM
హోలీ పండుగ(Holi festival)ను పురస్కరించుకుని ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా నైరుతి రైల్వేజోన్ 3 ప్రత్యేక రైళ్ళను నడుపనుంది. బెంగళూరు ఎస్‌ఎంవిటి - కొచువేలి స్టేషన్‌ల మధ్య రెండు ట్రిప్పులు,
బెంగళూరు: హోలీ పండుగ(Holi festival)ను పురస్కరించుకుని ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా నైరుతి రైల్వేజోన్ 3 ప్రత్యేక రైళ్ళను నడుపనుంది. బెంగళూరు ఎస్‌ఎంవిటి - కొచువేలి స్టేషన్‌ల మధ్య రెండు ట్రిప్పులు, ఎస్‌ఎంవిటి-కణ్ణూరుల మధ్య రెండు ట్రిప్పులు, హుబ్బళ్ళి- అహ్మదాబాద్‌ల మధ్య ఒక ట్రిప్పు చొప్పున ఈ ప్రత్యేక రైళ్ళు సంచరించనున్నాయి. ఈ నెల 19, 26 తేదీలలో ఎస్‌ఎంవీటీ - కణ్ణూరు రైలు రాత్రి 11.55కు బయల్దేరి మరుసటి రోజు మ ద్యాహ్నం కణ్ణూరుకు చేరుకుంటుంది. కణ్ణూరు నుంచి మార్చి 20, 27 తేదీలలో రాత్రి 8 గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఎస్‌ఎంవీటీ స్టేషన్‌కు చేరుకోనుంది. ఎస్‌ఎంవిటి -కొచువేలి స్టేషన్‌ల మధ్య ఈ నెల 23, 30 తేదీ లలో ప్రత్యేక రైలు సంచారం ప్రారంభం కానుంది. రాత్రి 11.55కు ఎస్‌ఎంవీటీలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కొచువేలి చేరుకుంటుంది. మార్చి 24, 31 తేదీలలో కొచువేలి నుండి రాత్రి 10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు ఎస్‌ఎంవీటీ చేరుకుంటుంది. కాగా హుబ్బళ్ళి- అహ్మ దాబాద్‌ల మధ్య ప్రత్యేక రైలు ఈ నెల 24న సంచరించనుంది. ఈ రైలు హుబ్బళ్ళిలో రాత్రి 7.30కు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 7.20కు అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. మార్చి 25న అహ్మదాబాద్ నుంచి రాత్రి 9.25కు బయల్దేరి మరు సటి రోజు సాయంత్రం 7.45కు ఎస్‌ఎంవీటీ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్ళకు రిజర్వేషన్ల బుకింగ్ జరుగుతోందని ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని నగరంలో శుక్రవారం విడుదలైన ప్రకటన పేర్కొంది.
Updated Date - Mar 16 , 2024 | 12:43 PM