Video: రివర్స్ చేస్తోండగా వేగంగా దూసుకొచ్చిన..
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:19 PM
ప్రమాదాలు రెప్పపాటులో జరుగుతుంటాయి. కర్ణాటకలో ఇలా ఓ ప్రమాదం జరిగింది. కారు రివర్స్ చేస్తోండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ట్రక్ ఢీ కొంది.
రెప్ప పాటులో ప్రమాదాలు జరుగుతుంటాయి. రోడ్డు మీద వాహనం నడిపే వారు కాదు, ఎదుట వచ్చే వారితో ప్రమాదం ఉంటుంది. అలా చాలా ప్రమాదాలు జరిగాయి. దానికి సంబంధించిన వీడియోలు చాలా చూశాం. అలాంటి ఓ ప్రమాదం కర్ణాటకలో జరిగింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.
ఏం జరిగిందంటే..
కేరళకు చెందిన ఓ కుటుంబం టయోట ఇన్నోవా కారులో కర్ణాటకలో గల ఉడుపి వచ్చారు. అక్కడ ఉన్న కొల్లూరు దేవిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో కుందపూర్ కుంభాషి చందిక దుర్గా పరమేశ్వరి ఆలయం దర్శనం కోసం ఆగారు. కుందపూర్ వద్ద హోటల్ వద్ద కారును రోడ్డు పక్కకు రివర్స్ చేస్తున్నారు.
వెనక నుంచి వేగంగా..
కారును మెల్లిగా రివర్స్ చేస్తున్నారు. వెనక నుంచి వాహనాలు రావడం లేదని అనుకున్నారు. అప్పటికే రివర్స్ లైట్స్ వెలుగుతున్నాయి. కారు మెల్లిగా లెఫ్ట్ కట్ చేసే సమయంలో వేగంగా ట్రక్ వచ్చింది. చేపల లోడుతో ఉన్న ఆ లారీ కారును ఢీ కొట్టి ముందుకు తోసుకెళ్లింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. డ్రైవర్‌తో సహా కారులో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.
ఢీ కొట్టి.. తోసుకెళ్లి
కారును లారీ ఢీ కొట్టి, తోసుకెళ్లింది. ఆ తర్వాత కారు రోడ్డు పక్కన పడిపోయింది. ప్రమాదంలో మొత్తం 10 మంది గాయపడ్డారు. కారులో ఉన్న ఏడుగురు గాయపడగా, లారీలో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. వారి వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..
Read Latest Telangana News and National News
Updated Date - Nov 21 , 2024 | 12:19 PM