ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: అఖిలేష్ ర్యాలీలో మళ్లీ తొక్కిసలాట.. కార్యకర్తల అత్యుత్సాహం

ABN, Publish Date - May 21 , 2024 | 09:20 PM

ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి పోటీ రసవత్తరమైన ఉంటుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అజంగఢ్‌ లో సమాజ్‌వాదీ పార్టీ మంగళవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది.

అజంగఢ్: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి పోటీ రసవత్తరమైన ఉంటుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అజంగఢ్‌ (Azamgarh)లో సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) మంగళవారంనాడు నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట చోటుచేసుకుంది. నిజామాబాద్ అసెంబ్లీ రిజియన్‌లోని ఖేర్వా సమీపంలో జరిగిన ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ప్రసంగించడడానికి లేవగానే ఎస్పీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్యుత్సాహం ప్రదర్శించారు. వేదిక వైపు పెద్దఎత్తున దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. సెక్యూటిరీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో సభావేదిక వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసులు ఎట్టకేలకు వారిని అదుపు చేయడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. సమాజ్‌వాదీ పార్టీ లాల్‌గంజ్ లోక్‌సభ అభ్యర్థి తరఫున ప్రచారం కోసం అఖిలేష్ పాల్గొన్న ఈ ర్యాలీలో ఆయన భార్య డింపుల్ యాదవ్ కూడా హాజరయ్యారు.

ECI: సీఎంపై నోరుపారేసుకున్న బీజేపీ అభ్యర్థికి ఈసీ షాక్..


జూన్ 4న తర్వాత కేబినెట్ ఏర్పాటు

అఖిలేష్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ టీకాలు వేసేందుకు కూడా దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఆ పార్టీ హయాంలో ప్రతి పేపర్ లీకైందని, రాజ్యంగం కంటే బీజేపీ నేతలు పెద్దవారా అని నిలదీశారు. బీజేపీకి 143 సీట్లు కూడా రావన్నారు. జూన్ 4 తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, అఖిలేష్, రాహుల్ గాంధీ గత ఆదివారంనాడు ప్రయాగరాజ్‌‌లో సంయుక్తంగా పాల్గొన్న ర్యాలీలోనూ తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఇరువురు నేతలు ఎలాంటి ప్రసంగం చేయకుండానే వెనుదిరిగారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 21 , 2024 | 09:20 PM

Advertising
Advertising