ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: కులం టార్గెట్‌ కాకపోతే అట్రాసిటీ చట్టం వర్తించదు

ABN, Publish Date - Aug 24 , 2024 | 03:51 AM

ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు జరిగిన ప్రతీ అవమానం, బెదిరింపు వ్యాఖ్యలు ఆ వర్గాలపై అఘాయిత్యాల నిరోధక చట్టం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

  • బాధితుడు ఎస్సీ అనే ఏకైక కారణంతో చట్టాన్ని ప్రయోగించలేరు

  • కేరళ యూట్యూబర్‌ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు జరిగిన ప్రతీ అవమానం, బెదిరింపు వ్యాఖ్యలు ఆ వర్గాలపై అఘాయిత్యాల నిరోధక చట్టం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్‌ పీబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఒక కేసులో ఈ చట్టానికి సంబంధించి వ్యాఖ్యానం చేసింది. మరునాదన్‌ మలయాళీ యూట్యూబ్‌ చానెల్‌ ఎడిటర్‌ షాజన్‌ షకీరాపై ఇదే చట్టం కింద నమోదైన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కేరళ ఎమ్మెల్యే పీవీ శ్రీనిజన్‌ను అవమానించే విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ వీడియోను అప్‌లోడ్‌ చేశారన్నది షాజన్‌ షకీరా మీద అభియోగం.


బాధితుడు ఎస్సీ లేదా ఎస్టీ అన్న ఒకే ఒక కారణంతో అవమానించిన వాడి మీద సదరు చట్టం వాడటం కుదరదని జస్టిస్‌ పార్థీవాలా స్పష్టం చేశారు. బాధితుడు ఎస్సీ లేదా ఎస్టీ అన్న కారణంతోనే ఉద్దేశపూర్వకంగా అవమానం లేదా బెదిరింపునకు పాల్పడినపుడే ఆ చట్టం వర్తిస్తుందని తెలిపారు. అంటే, బాధితుడు ఎస్సీ లేదా ఎస్టీ అనే ఒకే ఒక కారణంతో అవమానించి లేదా బెదిరించి ఉంటేనే ఈ చట్టం వర్తిస్తుందని విశదీకరించారు. కేరళ ఎమ్మెల్యే విషయంలో యూట్యూబర్‌ అలా చేసినట్లు అతని వ్యాఖ్యల్లో కానీ, కథనంలో కానీ ఎక్కడా కనిపించలేదని అన్నారు.


ఎమ్మెల్యే ఎస్సీ లేదా ఎస్టీ కాకపోతే యూట్యూబర్‌ ఆ ఆరోపణలు చేసేవాడా? కాదా? అన్న ప్రశ్న వేసుకుంటే ఈ చట్టం కిందకు వస్తుందా? రాదా? అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఎస్సీ అని యూట్యూబర్‌కు ముందే తెలుసన్న ఏకైక కారణంతో అతనిపై చట్టాన్ని ప్రయోగించలేరని జస్టిస్‌ పార్థీవాలా అన్నారు. కచ్చితంగా బాధితుడి కులాన్ని దృష్టిలో పెట్టుకొని అవమానం చేసినపుడే చట్టం వర్తిస్తుందని చెప్పారు. ఆ వీడియోలో ఎస్సీ, ఎస్టీలను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు లేవని గుర్తు చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 03:52 AM

Advertising
Advertising
<