Supreme Court : కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ లిస్టింగ్‌ను పరిశీలిస్తాం
ABN, Publish Date - Aug 13 , 2024 | 04:03 AM
మద్యం విధానం కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను లిస్టింగ్ చేయడాన్ని పరిశీలిస్తామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 12: మద్యం విధానం కుంభకోణంపై సీబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను లిస్టింగ్ చేయడాన్ని పరిశీలిస్తామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదే ఆరోపణపై ఈడీ నమోదు చేసిన కేసుల్లో నిందితుల బెయిల్ పిటిషన్లను లిస్టింగ్ చేసినందున, కేజ్రీవాల్ వినతిని కూడా లిస్ట్ చేయాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ‘‘ఈ-మెయిల్ పంపండి. చూస్తాను’’ అని అన్నారు.
Updated Date - Aug 13 , 2024 | 04:03 AM