Supreme Court: బెయిలు వచ్చిన మరునాడే మంత్రి పదవా...
ABN, Publish Date - Dec 03 , 2024 | 11:55 AM
నగదు మోసం కేసులో బెయిలుపై విడుదలైన మరునాడే మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji)ని సుప్రీంకోర్టు నిలదీసింది. అసలు తమిళనాడులో ఏం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
- సెంథిల్ బాలాజీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
చెన్నై: నగదు మోసం కేసులో బెయిలుపై విడుదలైన మరునాడే మంత్రిగా బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji)ని సుప్రీంకోర్టు నిలదీసింది. అసలు తమిళనాడులో ఏం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సెంథిల్ బాలాజీకి బెయిలు మంజూరు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సోమవారం న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది.
ఈ వార్తను కూడా చదవండి: Heavy Rains: మూడు జిల్లాలను ముంచెత్తిన ‘ఫెంగల్’
రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థలో ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురి వద్ద నగదు వసూలుచేసి మోసానికి పాల్పడ్డారని అప్పటి రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీపై అవినీతి కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల ఆధారంగా చట్టవిరుద్ధంగా నగదు బదిలీకి పాల్పడ్డారని సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు గత ఏడాది జూన్ 14న అరె్‌స్టచేశారు. ఈ కేసులో 471 రోజులు జైలుశిక్ష అనుభవించిన సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది.
దీంతో ఆయన బెయిలుపై విడుదలైన మరుసటిరోజు క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ నిర్ణయం వల్ల సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశముందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనకు బెయిలు మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు రీకాల్ చేయాలంటూ ఆ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభయ్ ఎస్.ఓగా, అగస్టిన్ జార్జి మాసిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.
బెయిలు మంజూరైన కొన్ని గంటల్లోనే మంత్రిగా ప్రమాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాకుండా ఆయన మంత్రి హోదాలో సాక్షులను ప్రభావితం చేయరా అని నిగ్గదీసింది. ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని సెంథిల్ బాలాజీని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదావేసింది.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 03 , 2024 | 11:55 AM