ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Supreme Court of India: ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్.. ఎస్‌బిఐకి నోటీసులు..

ABN, Publish Date - Mar 15 , 2024 | 11:13 AM

Supreme Court of India: ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులో ఎస్‌బిఐ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్‌బిఐకి నోటీసులు జారీచేసిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం.

Electoral Bonds Case

Supreme Court of India: ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులో ఎస్‌బిఐ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్‌బిఐకి నోటీసులు జారీచేసిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం. ఎలక్ట్రోరల్ బాండ్స్(Electoral Bonds) వివరాలు వెల్లడించిన ఎస్‌బిఐ.. ఆ బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికిచ్చారన్న విషయం తెలియడం లేదని రాజ్యాంగ ధర్మాసనం ఫైర్ అయ్యింది. అన్ని వివరాలను వెల్లడించాలని గతంలో ఇచ్చిన తీర్పులో వెల్లడించినా.. ఎస్‌బిఐ పట్టించుకోకపోవడంతో సీజేఐ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. అప్పటిలోగా ఎస్‌బిఐ వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా, ECI సీల్డ్ కవర్‌లో గతంలో ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. అంతేకాదు.. ECI సీల్డ్ కవర్‌లో ఇచ్చిన వివరాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో శనివారం సాయంత్రం 5గంటలకల్లా ఉంచాలని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2024 | 12:42 PM

Advertising
Advertising