ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏ సాక్ష్యాలతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు: సుప్రీం

ABN, Publish Date - May 18 , 2024 | 04:21 AM

ఢిల్లీ ఎక్సైజ్‌ విధానం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు తాజా సాక్ష్యాధారాలు ఏమున్నాయో చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది.

న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ ఎక్సైజ్‌ విధానం కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు తాజా సాక్ష్యాధారాలు ఏమున్నాయో చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై వాదోపవాదాలు విన్న సుప్రీంకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వు చేసింది. ఈ లోపు రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కింది కోర్టులో దరఖాస్తు చేసుకునే స్వేచ్చ ఆయనకు ఉన్నదని తెలిపింది.

కేజ్రీవాల్‌ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఆయనకు జూన్‌ 1 వరకు మధ్యంతర బెయిల్‌ను సుప్రీం ఇప్పటికే మంజూరు చేసింది. సిసోడియా అరెస్టు తర్వాత కేజ్రీవాల్‌కు సంబంధించి కొత్త సాక్ష్యాధారాలు ఏమి లభించాయో తమకు లిఖిత పూర్వకంగా వివరించాల్సిందిగా న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ఈడీని ప్రశ్నించారు.

ఈడీ వద్ద ఉన్న సాక్ష్యాలన్నీ 2023 జులై, ఆగస్టు నెలలకు సంబంధించినవని, ఈ సాక్ష్యాలన్నీ సిసోడియా విషయంలో లభించినవేనని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదించారు. గోవా ఎన్నికల్లో నిధుల ఉపయోగానికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని ఆయన చెప్పారు.

Updated Date - May 18 , 2024 | 04:21 AM

Advertising
Advertising