ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెయిల్‌ వచ్చిన వెంటనే మంత్రిగా నియామకమా?

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:03 AM

ఉద్యోగాల నియామకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంథిల్‌ బాలాజీని బెయిల్‌ వచ్చిన వెంటనే మళ్లీ మంత్రిగా తీసుకోవడంపై సోమవారం సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీ కేసులో సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ, డిసెంబరు 2: ఉద్యోగాల నియామకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంథిల్‌ బాలాజీని బెయిల్‌ వచ్చిన వెంటనే మళ్లీ మంత్రిగా తీసుకోవడంపై సోమవారం సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీనియర్‌ మంత్రిగా విధులు నిర్వర్తిస్తుంటే సాక్షులు ప్రభావితం కారా? అని ప్రశ్నించింది. ఈ చర్య కారణంగా నిందితులు స్వతంత్రంగా, నిబ్బరంగా ఉండగలరా అన్న సహేతుక సందేహాలు కలుగుతాయని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ ఎ.జి.మాసి్‌హల ధర్మాసనం వ్యాఖ్యానించింది. చెన్నైలోని మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఉద్యోగాల నియామకంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అప్పట్లో రవాణా మంత్రిగా పనిచేసిన సెంధిల్‌ బాలాజీని 2023 జూన్‌లో అరెస్టు చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 26న ఆయనకు సుప్రీంకోర్టులో బెయిల్‌ మంజూరయింది. సెప్టెంబరు 29న ఆయన ఎం.కె.స్టాలిన్‌ మంత్రివర్గంలో విద్యుత్తు, సంప్రదాయేతర విద్యుత్తు, ఎక్సయిజ్‌ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన కె.విద్యా కుమార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. దీనిపై సమాధానం చెప్పాలని సెంథిల్‌ బాలాజీకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

Updated Date - Dec 03 , 2024 | 04:03 AM