ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manish Sisodia: మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఊరట

ABN, Publish Date - Dec 11 , 2024 | 02:38 PM

బెయిలు షరతుల ప్రకారం, వారంలో రెండు సార్లు విచారణ కార్యాలయంలో ఆయన రిపోర్ట్ చేయాల్సి ఉండగా, ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది.

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ (Liquor policy)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో 'ఆప్' నేత మనీష్ సిసోడియా (Manish Sisodia)కు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఊరట లభించింది. బెయిలు షరతులను అత్యున్నత న్యాయస్థానం బుధవారంనాడు సడలించింది. బెయిలు షరతుల ప్రకారం, వారంలో రెండు సార్లు విచారణ కార్యాలయంలో ఆయన రిపోర్ట్ చేయాల్సి ఉండగా, ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది.

కాంగ్రెస్‌తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం


''వారానికి రెండుసార్లు రిపోర్ట్ చేయాలనే బెయిలు షరతును తొలగిస్తు్న్నాం. అయితే అప్లికెంట్ (సిసోడియా) రెగ్యులర్‌గా విచారణకు హాజరు కావాలి'' అని కోర్టు స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసులో సిసోడియాకు గత ఆగస్టు 9న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణ జరపకుండా 17 నెలల పాటు నిర్బంధంలో ఉంచడాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు బెయిలు మంజూరు చేసింది. అయితే ప్రతి సోమ, గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య విచారణ అధికారికి రిపోర్ట్ చేయాలని షరతు విధించింది.


సిసోడియా బెయిల్ అభ్యర్థనపై నవంబర్ 22న విచారణకు అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం సీబీఐ, ఈడీలను స్పందించాల్సిందిగా నోటీసులు ఇచ్చింది. 22వ తేదీ విచారణలో సిసోడియా తరఫు న్యాయవాది తమ వాదన వినిపిస్తూ, దర్యాప్తు అధికారుల ముందు సిసోడియా 60 సార్లు హాజరయినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. 2021-22 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవకతవకలు జరిగాయంటూ 2023 ఫిబ్రవరి 26న సిసోడియను సీబీఐ అరెస్టు చేసింది. అనంతరం మార్చి 9న మనీలాండరింగ్ కింద ఈడీ ఆయనను అరెస్టు చేసింది. 2023 ఫిబ్రవరి 28న ఢిల్లీ క్యాబినెట్‌కు సిసోడియా రాజీనామా చేసారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టివేశారు


ఇవి కూడా చదవండి..

Parliament: పార్లమెంట్ సమావేశాలు.. నోటీసులు ఇచ్చిన ఎంపీలు..

CM Stalin: అదానీతో భేటీ అవాస్తవం.. ఆ గ్రూపుతో ఒప్పందాల్లేవ్‌..

For National news And Telugu News

Updated Date - Dec 11 , 2024 | 02:38 PM