ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Supreme Court: కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై రేపు తీర్పు..

ABN, Publish Date - May 09 , 2024 | 03:58 AM

మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ ల్యాండరింగ్‌ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారానికి రిజర్వ్‌ చేసింది.

జైలు నుంచి పాలన సాగించేందుకు సౌకర్యాలు కల్పించాలన్న పిల్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, మే 8: మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ ల్యాండరింగ్‌ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారానికి రిజర్వ్‌ చేసింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం.. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసింది. ‘ఈ నెల 10వ తేదీన మధ్యంతర ఉత్తర్వులను వెలువరిస్తాం. అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పైనా అదే రోజు విచారిస్తాం’ అని ధర్మాసనం బుధవారం వెల్లడించింది.


ఒకవేళ ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ ఇస్తే ప్రభుత్వ అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని.. ఫైళ్లపై సంతకాలు చేయకూడదని మంగళవారం విచారణ సందర్భంగా కోర్టు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓ పార్టీ అధినేతగా ప్రచారం చేసుకోవచ్చని సూచించింది. ఇదిలా ఉండగా, తిహాడ్‌ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు సీఎం కేజ్రీవాల్‌కు సౌకర్యాలు కల్పించాలంటూ వేసిన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.


అంతేకాకుండా పిటిషనర్‌కు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. న్యాయవాది శ్రీకాంత్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ‘మేం ఎమర్జెన్సీ విధించాలా? సెన్సార్‌షిప్‌ లేదా మార్షల్‌ చట్టాన్ని అమలు చేయాలా? మీడియాకు, రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మేమేలా ఆదేశాలిస్తాం?’ అంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Updated Date - May 09 , 2024 | 03:58 AM

Advertising
Advertising