Supreme Court: పరువునష్టం కేసులో అతిషి, కేజ్రీవాల్‌కు ఊరట
ABN, Publish Date - Sep 30 , 2024 | 06:58 PM
క్రిమినల్ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో సోమవారంనాడు ఊరట లభించింది.
న్యూఢిల్లీ: క్రిమినల్ పరువునష్టం (Criminal Defamation) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi), మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో సోమవారంనాడు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి దిగువ కోర్టులో విచారణపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ ఇరువురిపై పరువునష్టం కేసు దాఖలైంది. దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు, ఫిర్యాదుదారు, బీజేపీ నేత రాజీవ్ బబ్బర్‌కు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం దిగువ కోర్టు విచారణపై స్టే ఇచ్చింది.
Rajnath Singh: 125 ఏళ్లు ఆయన బతకాలి, మోదీ అంతకాలం పాలించాలి
కేసు వివరాలివే..
అతిషి, కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలు సుశీల్ కుమార్ గుప్తా, మనోజ్ కుమార్‌పై బబ్బర్ క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. బీజేపీ ఆదేశాలతో వివిధ వర్గాలకు చెందిన 30 లక్షల మంది ఓటర్ల పేర్లను ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారంటూ 2018 డిసెంబర్‌లో జరిగిన మీడియో సమావేశంలో ఆప్ నేతలు ఆరోపించారని, ఇందువల్ల తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగిందని బబ్బర్ కోర్టుకు నివేదించారు. 2019 మార్చిలో కేజ్రీవాల్, ఇతరులకు మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేయగా, దీనిపై సెషన్స్ కోర్టును ఆప్ నేతలు ఆశ్రయించారు. అయితే సెన్షన్ కోర్టు వీరి వాదనను తోసిపుచ్చింది. అనంతరం హైకోర్టును ఆప్ నేతలు ఆశ్రయించగా క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కోర్టు సమర్ధించింది. దీంతో అతిషి, కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి..
BJP : జమిలిపై ముందుకే!
Updated Date - Sep 30 , 2024 | 06:58 PM