ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagjit Singh Dallewal: దల్లేవాల్‌ ఆరోగ్యంపై సుప్రీం ప్రత్యేక విచారణ

ABN, Publish Date - Dec 29 , 2024 | 04:10 AM

రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వృద్ధ నాయకుడు జగజిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో శనివారం సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో విచారణ జరిపింది.

న్యూఢిల్లీ, డిసెంబరు 28: రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వృద్ధ నాయకుడు జగజిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో శనివారం సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో విచారణ జరిపింది. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడంతో పాటు, ఇతర డిమాండ్లను ఆమోదించాలంటూ గత నెల 26 నుంచి ఆయన పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని ఖనౌడీ వద్ద దల్లేవాల్‌ దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ సుధాంశు ధులియాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ప్రత్యేక విచారణ జరిపింది. ఆస్పత్రిలో చేరేలా దల్లేవాల్‌ను నచ్చజెప్పాలని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు మంగళవారం వరకు గడువు ఇచ్చింది. ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు అవసరమైన ప్రయాణ సౌకర్యాల కోసం కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపింది. తాత్కాలిక ఆస్పత్రైనా ఏర్పాటు చేసి తరలించాలని సూచించింది.

Updated Date - Dec 29 , 2024 | 04:10 AM