ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maliwal Assault Case: కోర్టులో కంటతడి పెట్టిన స్వాతి మలివాల్

ABN, Publish Date - May 27 , 2024 | 03:26 PM

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారంనాడు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఒక దశలో కోర్టులోనే స్వాతి మలివాల్ కంటతడి పెట్టారు.

న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ (Swati Maliwal)పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారంనాడు ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఒక దశలో కోర్టులోనే స్వాతి మలివాల్ కంటతడి పెట్టారు.


బిభవ్ కుమార్ తరఫున సీనియర్ అడ్వకేట్ ఎన్.హరిహరన్ వాదనలు వినిపించారు. 'ఆప్' ఎంపీ (స్వాతి మలివాల్) ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండానే సీఎం నివాసలోకి చొరబడ్డారని, ఆ సమయంలో బిభవ్ కుమార్ సీఎం ఇంట్లో లేరని చెప్పారు. ''ఎవరైనా ఈ తరహాలో సీఎం నివాసంలోకి అడుగుపెడతారా? అది స్వయంగా సీఎం అధికారిక నివాసం. సమావేశానికి సంబంధించి ఆమె ఎలాంటి అపాయింట్‌మెంట్ కానీ, తాను వస్తున్నట్టు ముందస్తు సమాచారం కానీ ఇవ్వలేదు. కుమార్ ఆ సమయంలో అక్కడ లేరు. ఆమెను సెక్యూరిటీ సిబ్బంది ఆపినప్పటికీ లెక్కచేయుకండా వెయిటింగ్ రూమ్‌ వైపు వెళ్లారు. కుమార్‌తో మాట్లాడమని భద్రతా సిబ్బందికి చెప్పారు'' అని ఢిపెన్స్ కౌన్సిల్ తన వాదన సాగించారు.

Swati Maliwal: 'ఆప్'కు స్వాతి మలివాల్ రాజీనామా చేస్తారా..?


బలమైన గాయమేదీ లేదు..

ఆప్ ఎంపీ ఒంటిమీద తీవ్రమైన గాయమేది లేదని డిఫెన్స్ కౌన్సిల్ వాదించారు. ''ఘటన జరిగిన ప్రదేశాన్ని ఒకసారి గమనించండి. అక్కడ చాలామంది వ్యక్తులున్నారు. అలాంటి ప్రాతంలో (సీఎం నివాసంలో) ఘటన (దాడి) జరిగే అవకాశం ఎలా ఉంటుంది? వైటల్ పార్ట్‌లో ఎలాంటి తీవ్ర గాయాలు లేవు. అందువల్ల ఉద్దేశపూర్వకమైన దాడికి అవకాశం లేదు. అవి సొంతంగా చేసుకున్న గాయాలు కావచ్చు. ఆమె ఆరోపిస్తున్నట్టు దుస్తులు చింపే ఉద్దేశం ఎంతమాత్రం ఈ కేసులో లేదు. ముందస్తు వ్యూహంతో, టైలర్ మేడ్ కథనంతో మలివాల్ ఈ ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్‌లో ఉన్నదంతా ఆ తరువాత ఆలోచన చేసుకుని చేసినదే. నా క్లెయింట్‌ను దోషిగా విడిచిపెట్టమని చెప్పడం లేదు, బెయిలు ఇవ్వాలని మాత్రమే కోరుతున్నారు'' అని డిఫెన్స్ కౌన్సిల్ వాదించారు. దీంతో కోర్టులో విచారణకు హాజరైన స్వాతి మలివాల్ కంటతడి పెట్టారు.

Read National News and Latest News here

Updated Date - May 27 , 2024 | 03:26 PM

Advertising
Advertising