ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Swati Maliwal case: కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌పై చార్జిషీటు

ABN, Publish Date - Jul 16 , 2024 | 06:17 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ పై ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు తీస్ హజారీ కోర్టులో ఛార్జిషీటు నమోదు చేశారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Bibhav Kumar)పై ఢిల్లీ పోలీసులు మంగళవారంనాడు తీస్ హజారీ కోర్టులో ఛార్జిషీటు నమోదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు బిభవ్ కుమార్‌ను ఈనెల 30న భౌతికంగా తమ ముందు హాజరు పరచాలని ఆదేశించింది. జూలై 30వ తేదీ వరకూ ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. బిభవ్‌కుమార్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచారు.

Farmers protest: మళ్లీ ఢిల్లీకి రైతుల ర్యాలీ.. ఉద్యమం ఆగదని ప్రకటించిన బీకేయూ


ఢిల్లీ పోలీసులు 1,000 పేజీల ఛార్జిషీటును నమోదు చేసినట్టు తెలుస్తోంది. సీఎం నివాసం నుంచి డీవీఆర్‌, బిభవ్‌కు చెందిన రెంబు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మే 13న కేజ్రీవాల్‌ను కలుసుకునేందుకు ఆయన నివాసానికి వెళ్లినప్పుడు బిభవ్ తనపై దాడి చేసినట్టు స్వాతి మలివాల్ ఇటీవల కేసు పెట్టారు. దీంతో మే 19న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిలును ఢిల్లీ హైకోర్టు జూలై 12న తోసిపుచ్చింది. దీంతో బిభవ్ జ్యుడిషియల్ రిమాండ్‌‌లో కొనసాగుతున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 16 , 2024 | 06:17 PM

Advertising
Advertising
<