ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mehbooba Mufti: పాక్‌తో సయోధ్యే పరిష్కారం.. మెహబూబా ముఫ్తీ పాత పాట

ABN, Publish Date - Oct 23 , 2024 | 06:16 PM

రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగినంత కాలం జమ్మూకశ్మీర్ ప్రజలు బాధితులుగానే మిగిలిపోతారని, తాను మాత్రమే కాకుండా జమ్మూకశ్మీర్‌లోని ప్రతి ఒక్కరూ ఈ యుద్ధానికి తెరపడాలని కోరుకుంటున్నారని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, రక్తపాతంపై పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (PDP) చీఫ్ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) పాత పల్లవే అందుకున్నారు. ఉగ్రవాదం, రక్తపాతానికి తెరపడాలంటే భారత్, పాక్ మధ్య సయోధ్య ఒక్కటే ఏకైక మార్గమని అన్నారు. అక్టోబర్ 20న గందేర్‌బల్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ షానవాజ్ డర్‌‌ నివాసానికి మెహబూబా ముఫ్తీ బుధవారంనాడు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఇరుదేశాల శత్రుత్వం మధ్య జమ్మూకశ్మీర్ ప్రజలు చిక్కుకుపోయారని అన్నారు.

BRICS Summit: టెర్రర్ ఫండింగ్‌పై ద్వంద్వ ప్రమాణాలు.. చైనాకు మోదీ చురకలు


''రెండు దేశాల శత్రుత్వం మధ్య జమ్మూకశ్మీర్ ప్రజలు చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. వారి ప్రాణాలు, ఆస్తులు, ప్రతీదీ కోల్పోతూ బాధితులుగా మారుతున్నారు. మన పేద కార్మికులు సైతం బాధితులవుతున్నారు. డాక్టర్ షానవాజ్ కూడా ఈ తరహా బాధితుడే'' అని మెహబూబా ముఫ్తీ అన్నారు.


వాజ్‌పేయి తరహాలోనే..

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేసినట్టుగానే ఇరుదేశాలు (భారత్-పాక్) కలిసి కూర్చుని సయోధ్య సాధించడం ఒక్కటే మార్గమని, అలాకాకుంటే ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయని మాజీ సీఎం అన్నారు. రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగినంత కాలం జమ్మూకశ్మీర్ ప్రజలు బాధితులుగానే మిగిలిపోతారన్నారు. ముఫ్తీ మాత్రమే కాదు...జమ్మూకశ్మీర్‌లోని ప్రతి ఒక్కరూ ఈ యుద్ధానికి తెరపడాలని కోరుకుంటున్నారని అన్నారు. రెండు దేశాలు మాట్లాడుకుని జమ్మూకశ్మీర్‌ను రక్తపాతం చెర నుంచి విడిపించాలని సూచించారు. దీనికి ముందు, డాక్టర్ షానవాజ్ డర్ కుటుంబ సభ్యులను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం పరామర్శించారు. గందేర్‌బల్‌లోని టన్నెల్ నిర్మాల కార్మికులపై గత ఆదివారంనాడు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు, డాక్టర్ షానవాజ్ తీవ్రమైన గాయాలతో చికిత్సపొందుతూ మరణించారు.


ఇవి కూడా చదవండి..

Priyanka Gandhi: మీలో సొంత కుటుంబ సభ్యులను చూస్తున్నా.. వయనాడ్ సభలో ప్రియాంక ఎమోషనల్..

Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 23 , 2024 | 06:26 PM