ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Armstrong: బీఎస్పీ అధ్యక్షుడి హత్య కేసులో నిందితుడు ఎన్‌కౌంటర్‌

ABN, Publish Date - Jul 14 , 2024 | 10:47 AM

తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నై(chennai)లో బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్(Armstrong) ఇటీవల హత్యకు గురయ్యారు. పట్టపగలు కీలక నేత హత్య జరగడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం ఎన్‌కౌంటర్‌కు(encounter) గురయ్యాడు.

Tamil Nadu BSP state president Armstrong

తమిళనాడు(Tamil Nadu) రాజధాని చెన్నై(chennai)లో బీఎస్పీ చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్(Armstrong) ఇటీవల హత్యకు గురయ్యారు. పట్టపగలు కీలక నేత హత్య జరగడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన తిరువేంగడం ఎన్‌కౌంటర్‌కు(encounter) గురయ్యాడు. చెన్నై సమీపంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ మరణించాడు.

మాధవరం సమీపంలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకేసులో తిరువేంగడం ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. హత్యానంతరం ఈ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తిరువేంగడం చాలా రోజులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను అనుసరించి ఆయన కార్యకలాపాల గురించి సమాచారాన్ని సేకరించి ఆ తర్వాత హత్యకు ప్లాన్ చేశాడు.


హత్య ఎప్పుడు జరిగింది?

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ శుక్రవారం (జూలై 5) సాయంత్రం తమిళనాడు రాజధాని చెన్నైలో బహిరంగంగా హత్యకు గురయ్యారు. మూడు బైక్‌లపై వచ్చిన హంతకులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు గురైన కేసుపై దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో ఘటనా స్థలంలో పోలీసులు పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు.


అదుపులో 8 మంది

దీంతోపాటు అప్పుుడు గాయపడిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చనిపోయినట్లు ధృవీకరించారు. ఆ క్రమంలో నిందితుల్లో నలుగురు ఫుడ్ డెలివరీ కంపెనీ టీ షర్టులు ధరించి ఉన్నారని విచారణలో పాల్గొన్న సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ కేసులో మొత్తం ఇప్పటివరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 1. పొన్నై బాలా, 2. రాము, 3. తిరువేంగడం, 4. తిరుమల, 5. సెల్వరాజ్, 6. మణివణ్ణన్, 7. సంతృప్తి, 8. అరుల్ ఉన్నారు.


ఇది కూడా చదవండి:

Narendra Modi: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి.. ప్రధాని నరేంద్ర మోదీ స్పందన

Donald Trump: ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు..

Elon Musk: అమెరికా ఎన్నికల వేళ.. ఎలాన్ మస్క్ భారీ విరాళం, కారణమిదేనా?

For Latest News and National News

Updated Date - Jul 14 , 2024 | 11:12 AM

Advertising
Advertising
<