ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tamilisai: ఆ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ జరపండి: తమిళిసై

ABN, Publish Date - Apr 21 , 2024 | 11:52 AM

సౌత్‌ చెన్నై నియోజకవర్గంలోని 122వ వార్డు 13 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో రీ పోలింగ్‌ జరపాలని ఆ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(BJP candidate is Dr. Tamilisai Soundararajan) డిమాండ్‌ చేశారు.

చెన్నై: సౌత్‌ చెన్నై నియోజకవర్గంలోని 122వ వార్డు 13 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో రీ పోలింగ్‌ జరపాలని ఆ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(BJP candidate is Dr. Tamilisai Soundararajan) డిమాండ్‌ చేశారు. ఆ మేరకు పార్టీ ప్రతినిధులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అమీత్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం పోలింగ్‌ జరుగుతుండగా మైలాపూరు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 122వ వార్డు ఆస్టిన్‌నగర్‌లోని 13వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో ప్రభు, అరుణ్‌(Prabhu, Arun) సహా 50 మంది చొరబడి బీజేపీ ఏజెంట్లు గోవింద్‌ సహా పలువురిపై దాడి చేసి తరిమికొట్టి బూత్‌ స్వాధీనం చేసుకుని నకిలీ ఓట్లు వేశారని ఆరోపించారు.

ఇదికూడా చదవండి: Re polling: రేపు ఈ 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్

13, 15, 17 నెంబర్‌ పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఆ దుండగులు ఉదయం నుంచే నకిలీ ఓట్లు వేసినట్లు తమిళిసై పేర్కొన్నారు. ఇక చోళింగనల్లూరు ప్రాంతంలో వందల సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించినట్లు తమ పరిశీలనలో వెల్లడైందన్నారు. టి.నగర్‌లోని 199, 200, 201, 202 వార్డులలోనూ వేల సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగించారని ఆమె తెలిపారు.

ఇదికూడా చదవండి: Wine Shops: మద్యంషాపులకు పోటెత్తిన మందుబాబులు..

Updated Date - Apr 21 , 2024 | 11:52 AM

Advertising
Advertising