ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pemmasani Chandrasekhar: మార్పునకు సీఎం చంద్రబాబు ముందుంటారు

ABN, Publish Date - Dec 17 , 2024 | 02:24 PM

లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం ప్రవేశపెట్టరు. ఈ బిల్లును విపక్షాలకు చెందిన సభ్యులు వ్యతిరేకించారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ టీడీపీ మద్దతు తెలిపింది.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: జమిలి ఎన్నికల బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు మార్పునకు ఎప్పుడు ముందుంటారని కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల వ్యయం తగ్గుతుందన్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు రూ. 6 వేల కోట్లు ఖర్చు అయిందని మీడియా నివేదికలు స్పష్టం చేశాయని ఆయన గుర్తు చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల ఓటింగ్ శాతం పెరుగుతోందన్నారు. ఈ ఎన్నికల నిర్వహణ వల్ల కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు రాజకీయ పార్టీల ఖర్చు సైతం తగ్గుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు.

Also Read: జేపీసీకి జమిలి బిల్లు.. లోక్ సభలో ఓటింగ్


ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సులే

జమిలి ఎన్నికల బిల్లును ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సులే వ్యతిరేకించారు. ఈ బిల్లు సమాఖ్య, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే జేపీసీకి పంపాలని సూచించారు.

Also Read: సభలో ప్రవేశ పెట్టిన జమిలి ఎన్నికల బిల్లు


కాంగ్రెస్ ఎంపీ గౌరవ గొగోయ్

జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్ ఎంపీ గౌరవ గొగోయ్ వ్యతిరేకించారు. ఓటర్లకు రాజ్యంగం కల్పించిన అధికారాలకు వ్యతిరేకంగా ఈ జమిలి బిల్లు ఉందన్నారు. కానీ ప్రస్తుతం తెచ్చిన బిల్లు ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలను కట్టబెడుతోందని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేలా ఈ బిల్లు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ జమిలి బిల్లు ఉందని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వం 5 ఏళ్ల కాలపరిమితి ఖచ్చితంగా కొనసాగించాల్సిందేనన్నారు. ఈ జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లును జేపీసీకి పంపాలని డిమాండ్ చేశారు.

Also Read: మహిళామణులకు గుడ్ న్యూస్ .. మళ్లీ తగ్గిన పసిడి ధర


సమాజవాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్

జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నామమని సమాజ వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ స్పష్టం చేశారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలను ఒకసారి కేంద్రం జరప లేకపోతుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అలాంటిది ఒకే సారి దేశవ్యాప్తంగా ఎన్నికలు కేంద్రం ఎలా జరుపుతామని చెబుతుందంటూ సందేహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ, దళిత, ముస్లిం, వెనుకబడిన వర్గాల వ్యతిరేకంగా ఉందన్నారు. దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: ఫర్ ది పీపుల్, బై ది పీపుల్‍కు స్వస్తి పలికిన పాలకులు


ఎంపీ మొహమ్మద్ బషీర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ

జమిలి ఎన్నికల బిల్లు రాజ్యాంగంపై దాడి అని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎంపీ మొహమ్మద్ బషీర్ అభివర్ణించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

Also Read: ట్రైయినీ వైద్యురాలి ఘటనలో ఏం జరిగిందో..?

Also Read: బైడెన్ నిర్ణయంపై ట్రంప్ అభ్యంతరం


జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్ సభలో మంగళవారం ప్రవేశపెట్టారు. దీంతో ఇండియా కూటమిలోని నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లును వెంటనే ఉప సంహరించుకోవాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే ఈ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపుతున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ ప్రతిపాదించారు. ఆ క్రమంలో లోక్ సభలో ఓటింగ్ జరిగింది. అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు.

For National News And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 02:34 PM