Deve Gowda: చివరి శ్వాస వరకూ రాజకీయాల్లో ఉంటా
ABN, Publish Date - Nov 08 , 2024 | 09:52 PM
మోదీపై పోటీ చేయగలిగే నేత 'ఇండియా' కూటమిలో లేరని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడంలో విజయవంతమైన నేతల్లో డొనాల్డ్ ట్రంప్, మోదీ ఉన్నారని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. మోదీ-ట్రంప్ మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని చెప్పారు.
బెంగళూరు: తన తుది శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) అన్నారు. చన్నపట్ల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన మనుమడు నిఖిల్ కుమారస్వామి తరఫున శుక్రవారంనాడు ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను నిఖిల్ కోసం రాజకీయాల్లోకి తిరిగి రాలేదని, ఆయన గెలిచినా కూడా ఆగేది లేదని, పార్టీ పటిష్టతకు కృషి చేస్తూనే ఉంటానని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపేంత వరకూ విశ్రమించేది లేదని అన్నారు.
CEC: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు.. సీఈసీ వార్నింగ్
కన్నీళ్లు మా కుటుంబ వారసత్వం
ఎన్నికల్లో గెలుపు కోసం హెచ్‌డీ కుమారస్వామి, నిఖిల్ కుమార స్వామి ''కన్నీళ్లు'' కారుస్తారంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై దేవెగౌడ స్పందిస్తూ, ఆకలి, కష్టాలు తమకు బాగా తెలుసునని, కన్నీళ్లు తమ తమ కుటుంబ వారసత్వమని అన్నారు. ఆకలి, కన్నీళ్లు అంటే ఏమిటో స్యయంగా తాను అనుభవించానని చెప్పారు. రైతులు, పేదల కష్టసుఖాలు తమకు తెలుసునని, వారి కష్టనష్టాలను తెలుసుకోవాలంటే అందుకా చాలా పెద్దమనసు ఉండాలని, కన్నీళ్ల గురించి హేళనగా మాట్లాడే వాళ్ల గురించి చెప్పేదేముంటుందని డీకేపై దేవెగౌడ విసుర్లు విసిరారు.
మోదీతో సరిపోల్చే నేత లేడు...
'ఇండియా' కూటమిపై దేవెగౌడ విమర్శలు గుప్పిస్తూ, మోదీ నాయకత్వానికి దీటైన నేత ఎవరూ ఆ కూటమిలో లేరని అన్నారు. మోదీపై పోటీ చేయగలిగే నేత కూడా లేరన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడంలో విజయవంతమైన నేతల్లో డొనాల్డ్ ట్రంప్, మోదీ ఉన్నారని, మోదీ-ట్రంప్ మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని చెప్పారు. అలాంటి నాయకత్వం, కూటమి ఉంటేనే విపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వగలరని అన్నారు.
ఇవి కూడా చదవండి...
Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ
CM Sukhu: సీఎం తినాల్సిన సమోసాలు ఎవరు తిన్నారు.. దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు
For More National and telugu News
Updated Date - Nov 08 , 2024 | 09:52 PM